ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

ABN, First Publish Date - 2023-08-09T01:04:10+05:30

బైక్‌ను టిప్పరు ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి.

  • భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

కొవ్వూరు, ఆగస్టు 8: బైక్‌ను టిప్పరు ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన కాసమనేని వెంకట రామకృష్ణ(38) కొవ్వూరులోని ఏసీఆర్‌ లాడ్జి సమీపంలో నివాసం ఉంటున్నాడు. ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ చేస్తుంటాడు. మంగళవారం సాయంత్రం భార్య కీర్తితో కలసి బైక్‌పై తణుకు బయలుదేరాడు. వీరిని కొవ్వూరు ఔరంగాబాద్‌ అమ్మవారి గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాల య్యాయి. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ బి.దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కీర్తిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గుంటూరులోని మృతుడి బంధువులకు సమాచారం అందించారు.

Updated Date - 2023-08-09T01:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising