Chalasani Srinivas: కేంద్ర ప్రభుత్వం ఏపీని బ్లాక్ మొయిల్ చేస్తోంది..
ABN, First Publish Date - 2023-04-07T11:08:55+05:30
ఏపీ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తున్నామని, విభజన హామీలు అమలు చేయటంలో రాజకీయ పార్టీలు భయపడుతున్నాయని ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం చేస్తున్నామని, విభజన హామీలు అమలు చేయటంలో రాజకీయ పార్టీలు (Political Parties) భయపడుతున్నాయని ప్రత్యేకహోదా (Special Status) విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ (Chalasani Srinivas) అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయమనేవారు ఆంద్రా ద్రోహులని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని పోలవరం నిర్వాసితులతో కలిశామని, కేంద్ర ప్రభుత్వం (Central Govt.) ఏపీని బ్లాక్ మొయిల్ చేస్తోందని, నిర్వాసితులకు ఏలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేంద్రం పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) విషయంలో మోసం చేస్తోందన్నారు. పునరావాస కాలనీలు కూడా మునిగిపోయాయంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) విషయంలో ప్రభుత్వం మాట్లాడకుండా నిద్రపోతోందని చలసాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. 135 అడుగుల ఎత్తుకు పోలవరం ఎత్తు తగ్గించటం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వ బ్లాక్ మొయిల్ విదానంపై సీఎం జగన్ (CM Jagan), ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి శాలువాలు కప్పి వస్తున్నారే తప్ప ఏపీకీ న్యాయం చేయటం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అగ్రిగోల్డ్ డిపాజిటర్లు (Agrigold Depositors) సుమారు 300 మంది వరకు మృతి చెందారని చలసాని శ్రీనివాస్ అన్నారు. కృషి బ్యాంక్, అగ్రిగోల్డ్‌లు మూసివేస్తే సామాజిక వర్గాల వారు యాజమాన్యానికి మద్దతు ఇచ్చారని, పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేసుల భయంతో కేంద్రానికి భయపడుతున్నారని, ఎంపీలు ఢిల్లీలో ధర్నాలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంతో రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌పై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని.. అగ్రిగోల్డ్, పోలవరంపై ఉండవల్లి వస్తే కలిసి పోరాడదామని చలసాని శ్రీనివాస్ అన్నారు.
Updated Date - 2023-04-07T11:08:55+05:30 IST