ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబు వెంటే..బాబు తోనే!

ABN, First Publish Date - 2023-10-22T00:28:39+05:30

14 ఏళ్లు సీఎంగా సేవలందించిన..73 ఏళ్ల వయసున్న చంద్రబాబును పాలకుల కుటిలనీతి.. రాజకీయకక్ష బంధించి వికటాట్టహాసం చేస్తున్నాయేమోకానీ.. ఆయ నపై ప్రజలకున్న అభిమానం ముందు మాత్రం అవి రోజూ ఓడిపోతూనే ఉన్నాయి.

9వ తేదీన జైలు వద్ద ఎన్‌ఎస్‌జీ భద్రతలో చంద్రబాబు (ఫైల్‌)

రాజమహేంద్రవరంలోనే ఎన్‌ఎస్‌జీ

ఎల్లలుదాటి వస్తున్న అభిమానం

జైలు చెంతనే బాబు కుటుంబం బస

43 రోజులుగా లక్ష మంది రాక

చంద్రబాబుకు అన్ని వర్గాల మద్దతు

భువనేశ్వరిని కలుస్తున్న వైనం

నిర్బంధాలు దాటుకుని సంఘీభావం

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ఆగని పోస్టుకార్డుల ఉద్యమం

బాబు రాకకు ఎదురుచూపులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

14 ఏళ్లు సీఎంగా సేవలందించిన..73 ఏళ్ల వయసున్న చంద్రబాబును పాలకుల కుటిలనీతి.. రాజకీయకక్ష బంధించి వికటాట్టహాసం చేస్తున్నాయేమోకానీ.. ఆయ నపై ప్రజలకున్న అభిమానం ముందు మాత్రం అవి రోజూ ఓడిపోతూనే ఉన్నాయి. చట్టాన్ని ఇష్టానుసారం ప్రయోగించి అడ్డుకోవాలన్న దురాలోచనలను బద్దలుకొ ట్టుకుంటూ ఎల్లలుదాటి పరుగుపరుగున వస్తున్న అభి మానం ‘చంద్రబాబుకు తోడుగా.. ఆయన కుటుంబానికి అండగా’ నిలుస్తోంది. పాలకుల ఎత్తులు, కుయుక్తులు కట్టలు తెంచుకుంటున్న జనావేదన ముందు చిత్తయి పోక తప్పడంలేదు. చంద్రబాబును జైలుకు తరలించిన నాటి నుంచీ అన్నిదారులూ రాజమహేంద్రవరం వైపే చూస్తున్నాయి. కన్నీటిని దిగమింగుకొని.. ఆవేదనను పం టిబిగువున అదిమిపట్టుకొని వందలు, వేల కిలోమీటర్ల అవతల నుంచి వస్తున్న జనం భువనేశ్వరిని కలుసుకొని ధైర్యం చెప్పి మనసును కాస్త చల్లబర్చుకుంటున్నారు.

కుటుంబం తోడుగా..

చంద్రబాబును గత నెల 9న అర్ధరాత్రి వేళ జైలుకు తీసుకొచ్చారు. తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి స్థాణువై పోయిన లోకేశ్‌.. కాసేపటి తర్వాత జైలుకు దగ్గరలోని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడకు చేరుకున్నారు. మరుసటిరోజే భువనేశ్వరి, బ్రాహ్మణి వచ్చేశారు. అప్పటి నుంచీ క్యాంపు కార్యాలయంలోనే ఉంటున్నారు. బస్సుల్లో బస చేస్తున్నారు. ములాఖత్‌లో చంద్రబాబును కలుసుకొని కళ్లారా చూసుకొంటున్నారు. ఆయన కష్టాలు చూసి తల్లడిల్లిపోతున్నారు. లోకేశ్‌ కోర్టు, జాతీయ నాయకులను కలిసే పనిపై ఢిల్లీ వెళ్లి వచ్చేస్తున్నారు. చంద్రబాబును జైలుకు తీసుకొచ్చి 43 రోజులు గడిచింది. సుమారు 35 రోజులకు పైగా లోకేశ్‌, భువనేశ్వరి,బ్రాహ్మణి రాజమహేంద్రవరంలోనే ఉన్నారు.

ఎన్‌ఎస్‌జీ ఇక్కడే..

గత 43 రోజుల వరకు చంద్రబాబు దేశంలోనే అత్యంత సురక్షితమైన ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూ రిటీ గార్డ్స్‌) భద్రతలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు 12+12 ఎన్‌ఎస్‌జీ కమెండోల భద్రత ఉంది. చంద్రబాబు గత నెల 10న అర్ధరాత్రి 1.20 గంటలకు జైలులోకి వెళ్లగానే ఎన్‌ఎస్‌జీ కమెండోలు, చంద్రబాబు వ్యక్తిగత భద్రత సిబ్బంది బయట ఆగిపోక తప్పలేదు. ఆ నిమిషం వారి కళ్లల్లో ఏదో తెలియని బాధ అలుముకొంది. అప్పటి నుంచీ ఎన్‌ఎస్‌జీ కమెండోలు రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు. రోజూ జైలు పరిసరాలను తమదైన శైలిలో పరిశీలిస్తున్నారు. చంద్రబాబు వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. రెండు మూడు రోజులకొకసారి జైలు పరిసరాల్లో భద్రత తదితర విషయాలపై తమ పై అధికారులకు నివేదిస్తున్నట్టు సమాచారం.

అభిమానం అండగా..

చంద్రబాబును అరెస్టు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎత్తులు వేస్తోందనే మాట బయటకు పొక్కిన క్షణం నుంచే ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నంద్యాలలోని చంద్రబాబు శిబిరం వద్దకు పోలీసులు చేరుకున్నారనే సమాచారం దావానంలా వ్యాపించి గం టల వ్యవధిలోనే వందలాది మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు విజ్ఞత ఎవరినీ గీత దాట కుండా చేసింది. తర్వాత ఆయనను విజయవాడ తరలి స్తున్నప్పుడూ రోడ్డుకిరువైపులా నిలుచున్న జనం మన సులో బాధపడుతూనే మేం మీకున్నాం అనే సందేశాన్ని మౌనంగా పంపించారు. విజయవాడ సీఐడీ కార్యాల యం, ఏసీబీ కోర్టు వద్దా అదే రద్దీ కనిపించింది. చంద్ర బాబును రాత్రివేళ విజయవాడ నుంచి తరలిస్తుంటే ఆ సమయంలో కూడా నిద్రాహారాలు లేకుండా చంద్ర బాబును చూడాలనే ఆతృతతో గంటలపాటు నిలువు కాళ్లపై ఉండిపోయారు. చంద్రబాబును జైలుకు తీసుకొ చ్చిన మరుసటి రోజు నుంచీ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎక్కడికక్కడ కట్టడి ఏర్పాట్లు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా నిరసన తెలిపే హక్కు పౌరులకు రాజ్యాంగం ఇచ్చిందనే విష యాన్ని రాజకీయ కక్ష కమ్మేసింది. దీంతో సంఘీభావం తెలియజేయడానికి వస్తున్న వారిపైనా బెదిరింపులను ఎక్కువపెట్టారు. ఐటీ ఉద్యోగులను ఆపేశారు. అమరా వతి రైతులను అడ్డుకొన్నారు. ఎక్కడ చూసినా అడ్డంకు లను చూసి కొన్ని సందర్భాల్లో ప్రశాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేక కశ్మీరు వంటి కల్లోల ప్రాంతాల్లో ఉన్నా మా? అనే అనుమానం ప్రజలకు కలిగింది. అయితే అభిమానం ముందు నిర్బంధం చతికిలపడక తప్ప లేదు. చంద్రబాబును జైలుకు తీసుకొచ్చిన నాటి నుంచీ అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి భువనేశ్వరికి సంఘీభావం తెలిపి.. జైలు బయట నుంచే ‘బాబు నీకు మేమున్నాం’ అనే సందేశాన్ని పంపించి వెళ్తున్నారు. చంద్రబాబును జైలుకు తీసుకొచ్చిన తర్వాత ఈ 43 రోజుల్లో లక్షమందికిపైగా భువనేశ్వరి వద్దకు వచ్చి అండగా నిలిచారు. బాబుకు మద్దతుగా సంత కాలు చేశారు. వాళ్లలో అధికశాతం మహిళలే ఉండడం గమనార్హం. ఉభయ గోదావరి జిల్లా లతో పాటు ఎక్కడో ఉన్న ప్రకాశం, కడప నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి, మలేషియా, ఆస్ట్రేలి యా వంటి ఇతర దేశాల నుంచి వచ్చి చంద్రబాబు కుటుంబ ఆవేదనను పంచుకొంటున్నారు. తమ అభి మానమే చంద్రబాబు మేలిమి బంగారమని రుజువు చేస్తుందని భరోసా ఇస్తున్నారు. ఇక వేలాదిగా ‘మేము సైతం.. బాబుతోనే’ అంటూ పోస్టుకార్డులు ప్రతిరోజూ సెంట్రల్‌ జైలుకు చేరుతున్నాయి.

అలుపెరగని నిరసనలు

చంద్రబాబు త్వరగా విడుదల కావాలని.. ఆయనపై పన్నాగాలు పన్నిన వాళ్లు అధోగతిపాలు కావాలంటూ ఎక్కడికక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా విడుదల కావాలని ప్రత్యేక పూజలతో పాటు హోమాలు, దానాలు చేస్తున్నా రు. మహిళలు పెద్ద సంఖ్యలో పారాయణాలు చేస్తు న్నారు. ఇక నిరసనలకు క్షణం అలుపు ఉండడం లేదు. రాజకీయాలకతీతంగా శాంతిభద్రతలకు విఘాతం కలి గించకుండా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన ప్రద ర్శనలు చేస్తున్నారు. న్యాయం తప్పకుండా గెలుస్తుం దంటూ ఇప్పటికే భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ‘సత్యమేవ జయతే’ దీక్షను నిర్వహించిన విషయం తెలి సిందే.ఆ దీక్షకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వెన్ను దన్నుగా నిలిచారు.. చంద్రబాబు అభిమానులు 43 రోజు లుగా రాజమహేంద్రవరానికి వస్తూనే ఉన్నారు.. బాబు తోనే.. బాబు వెంటే అంటూ నినదిస్తున్నారు.. అన్ని వర్గాలు సంతకాలతో మద్దతు తెలుపుతూనే ఉన్నారు.

Updated Date - 2023-10-22T00:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising