టీడీపీలో జోష్
ABN, First Publish Date - 2023-02-19T00:47:09+05:30
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల ఉమ్మడి గోదావరి జిల్లా పర్య టన విజయవంతం కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పెరిగింది. కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఉలిక్కిపడుతున్నాయి.
ఉత్తేజంగా మూడు రోజుల పర్యటన
సభలకు పోటెత్తిన జన ప్రవాహం
ఉలిక్కిపడిన వైసీపీ శ్రేణులు
చివరి రోజు ఆటంకం
అయినా ఆగని చంద్రబాబు
వెంటే నడిచిన నాయకులు
టీడీపీ కేడర్‌కు దిశా నిర్దేశం
జిల్లాలో ముగిసిన పర్యటన
హైదరాబాద్‌కు పయనం
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు రోజుల ఉమ్మడి గోదావరి జిల్లా పర్య టన విజయవంతం కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ పెరిగింది. కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఉలిక్కిపడుతున్నాయి. ఇదేంఖర్మ మన రాష్ర్టానికి అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. బాబు పర్యటనలకు ఎక్కడికక్కడ అనూహ్య స్పందన లభిచింది. యువత,మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. పార్టీ కేడర్ ఆనందంతో ఉన్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుపట్టడంతో పాటు, జగన్‌ను ఓ సైకోగా వర్ణిస్తూ, జగన్‌ను చూస్తేనే దరిద్రం పట్టుకుందని, జగన్ సీఎం కావడంతోనే ఆంధ్రప్రదేశ్‌కు దరిద్రం పట్టుకుని తీవ్రంగా విమర్శిస్తూ జగన్ వైఖరిని చంద్రబాబు ప్రజలకు వివరించడంతో సక్సెస్ అయ్యారు. జగన్ గురించి చంద్రబాబు ఒక మాట చెబితే ప్రజల నుంచి మరో మాట కూడా జోడవుతుండడంతో చంద్రబాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు నడిచారు. పార్టీ క్యాడర్‌ను ఉత్సాహ పరచడంతోపాటు, పోరాట పటిమను పెం చారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ధ్వంసం చేశారని , పోలవరం ప్రాజెక్టుకోసం త్యాగం చేసిన ప్రజలకు న్యాయం చేయడంతో పాటు వారి కోసం ప్రత్యేక జిల్లాను కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో గిరిజన ప్రాంత ప్రజల్లో ఆనందం కలిగింది. ఇక్కడి గిరిజన మండలాలను పాడేరు జిల్లాలో కలపడంతో అక్కడకు వెళ్లి సమస్యలు చెప్పుకోలేక, వెళ్లడానికి సరైన మార్గం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన ప్రకటన గిరిజన ప్రాంతాల ప్రజలకు సంతోషాన్ని ఇవ్వగా, వైసీపీని ఉలిక్కిపడేటట్టు చేసింది. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసిన విమర్శలు వైసీపీకి బుర్రతిరిగేటట్టు చేశాయి. గోకవరం, జక్కంపేట, పెద్దాపురం, సామర్లకోట, అనపర్తి సభలకు అత్యధికంగా జనం తరలిరావడం, చంద్రబాబు అన్నివర్గాలకు దగ్గరవుతుండడంతో పార్టీ వర్గాలలో ఉత్సాహం పెరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు.. కొత్త తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశాలు లభిస్తాయనే ప్రచారం జరుగుతోంది. కొందరు పాతవారిని ఎక్కడి వారిని అక్కడ ఉంచడానికి తీసుకున్న నిర్ణయం వల్ల కొంత మందిని స్వయంగా పిలిచించి చంద్రబాబు చర్చించారు. కొందరిని బుజ్జగించారు. పెద్దాపురం నుంచి తిరిగి నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో అక్కడ సీటు ఆశిస్తున్న చంద్రమౌళి అలక పాన్పు ఎక్కగా ఆయనను కూడా ఒప్పించే ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం.దళితనేత మహాసేన రాజేష్ వంటి వాళ్లు పార్టీ తీర్ధం పుచ్చుకోవడం పార్టీకి దళితులు దగ్గరవుతున్న సంకేతం. బీసీలు, ఎస్సీలపై కూడా తెలుగుదేశం పార్టీ బాగా దృష్టి పెట్టింది. పార్టీ కోసం పని చేసేవారికి ఏదో విధంగా గుర్తింపు ఇవ్వాలనే నిర్ణయంతో పార్టీ ఉంది. దీంతో అనేక మంది పార్టీకి దగ్గరవుతున్నారు. అంతేకాక అధికార వైసీపీ వైఖరి నచ్చక విసిగిపోయిన వారు కూడా అనేక మంది ఉన్నారు. కొద్దినెలల కిందట వరకూ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లకపోతే, అఽధికార పార్టీని తట్టుకోలేమని ఆలోచించిన వారు కూడా ఇక తెలుగుదేశం లో పదిలమనే నిర్ణయానికి వచ్చారు. ఇతర పార్టీ వాళ్లు కూడా టీడీపీ వైపు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేడర్‌లోనూ, ప్రజలలో కూడా జోష్ పెరిగింది.
చంద్రబాబు వైఖరే కరెక్ట్
అనపర్తిలో సభకు అనుమతి ఇచ్చి మళ్లీ పోలీసులు తిరస్కరించడం, చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకోవడం, పోలీసులు రోడ్డు మీద బైఠాయించడం.. అప్పుడు చంద్రబాబు కాన్వాయ్ దిగి, ఏకంగా 6 కిలోమీటర్ల చీకట్లలో నడచి రావడం, ఆ యన నడక తీరు, ఆ యన ధైర్యం, పట్టుదల ప్రజల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు కరెక్ట్‌గానే వ్యవహరించారనే వాదన ఎక్కువ వినిపిస్తోంది. జగన్ కెలికి చంద్రబాబు చేత మరింత గట్టిగా తన్నించుకున్నట్టు పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. చంద్రబాబు తోపాటు, నిమ్మకాయల చినరాజప్ప , రామకృష్ణారెడ్డి, కెఎస్ జవహర్, గొల్లపల్లి సూర్యారావు, ఆనందరావు వనమాడి కొండబాబు, నవీన్,స్వామినాయుడు, శ్రీనివాస్ వంటి వారిపే కేసులు పెట్టడం కూడా చర్చనీయాంశమైంది.
ముగిసిన బాబు పర్యటన
మధురపూడి ఫిబ్రవరి18: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి హైదరాబాద్ పయనమ వ్వాల్సి ఉంది. అనపర్తిలో ఎదురైన అనుకోని సం ఘటన నేపథ్యంలో శుక్రవారం రాత్రి అనపర్తి మం డలం పొలమూరులో బస చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయానికి శనివారం ఉదయం 11:40 గంటలకు చేరుకున్నారు. ఉమ్మడి తూర్పు జిల్లాలు నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి చంచ్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇండిగో విమానంలో చంద్రబాబు హైదరాబాద్ బయలు దేరారు.రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రెడ్డి సుబ్రహ్మణ్యం, జోతుల నెహ్రూ, కెఎస్ జవహర్, వనమాడి కొండబాబు, కాశీ నవీన్, తనకాల నాగేశ్వరరావు, మింగి లక్ష్మీనారా యణ, కుడిపూడి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-19T00:47:11+05:30 IST