జనచంద్రుడు
ABN, First Publish Date - 2023-08-18T01:25:43+05:30
జై చంద్రబాబు.. జైజైచంద్రబాబు నినాదాలతో కోనసీమ ముఖద్వారం హోరెత్తింది..అడుగడుగునా చంద్రబాబుకు నీరాజనం పలికారు..నువ్వు కావాలయ్యా.. రావాలయ్యా.. మా జీవితాలు మార్చాలయ్యా అంటూ పెద్ద ఎత్తున నినా దాలు చేశారు.
కోనసీమలో పోటెత్తిన జనం
బస్సెక్కి మహిళలతో మాటా మంతీ
ఇసుక గుట్టల వద్ద సెల్ఫీ
హోరెత్తిన రావులపాలెం సభ
ఎమ్మెల్యే చిర్ల అవినీతిపై ధ్వజం
ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక
అమలాపురం(ఆంధ్రజ్యోతి)/రావులపాలెం, ఆగస్టు 17 : జై చంద్రబాబు.. జైజైచంద్రబాబు నినాదాలతో కోనసీమ ముఖద్వారం హోరెత్తింది..అడుగడుగునా చంద్రబాబుకు నీరాజనం పలికారు..నువ్వు కావాలయ్యా.. రావాలయ్యా.. మా జీవితాలు మార్చాలయ్యా అంటూ పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు జనసునామీ పోటెత్తింది. ఆలమూరు మండలం గుమ్మిలేరు నుంచి గురువారం మధ్యా హ్నం నాలుగు గంటలకు ప్రారంభమై 20 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర రాత్రి 7 గంటలకు రావులపాలెం చేరుకుంది. చంద్రబాబుకు గుమ్మిలేరు, కొత్తూరు సెంటరు, ఆలమూరులో ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారిపొడవునా మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపించారు. క్రేన్లతో దండలు వేశారు. చంద్రబాబు భారీ ర్యాలీతో వస్తూ రావులపాలెం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో టిక్కెట్టు తీసుకుని ప్రయాణించారు. చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ లోక్‌సభ ఇన్‌చార్జ్ గంటి హరీష్‌మాధుర్ బస్సులో ఉన్నారు. మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో చేర్చిన అంశాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, విద్యుత్ బిల్లులు వంటి ధరల పెరుగుదల అంశాలపై మహిళలు చంద్రబాబు ముందు తమ గోడు వ్యక్తం చేసుకున్నారు. మార్గమధ్యలో జొన్నాడలో ఉన్న ఇసుక కొండలను పరిశీలించి సెల్ఫీ తీసుకున్నారు. అక్కడే ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అతని అనుచరుడు తాడి మోహన్‌రెడ్డిల ఇసుక దోపిడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎటువంటి అనుమతులు లేకుండా సీఎం జగన్ సహకారంతో రూ.228 కోట్ల విలువైన ఇసుకను తరలించుకుపోతున్న తీరును ఎండగట్టారు. అనంతరం జొన్నాడలో చంద్రబాబుకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి గౌతమి నదీపై జొన్నాడ-రావులపాలెం బ్రిడ్జి మీదుగా భారీ ర్యాలీతో రావులపాలెం కాలేజీ వద్దకు వచ్చే సరికి బాణసంచాతో వేలాదిమంది ఘనస్వాగతం పలికారు. రావులపాలెం వంతెన వద్ద నుంచి సభా ప్రాంగణానికి రావడానికి కిలోమీటరు మేర పర్యటనకు గంటకు పైగా వ్యవధి పట్టింది. రావులపాలెం సెంటర్‌లో చంద్రబాబు మినీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలతో సింబల్స్‌తో కూడిన భారీ గజమాలను క్రేన్ సహాయంతో చంద్రబాబు వాహనం దగ్గర ఉంచారు. అనంతరం ఆత్రేయపురం మండల తాడిపూడికి చెందిన కుంసంపూడి రామరాజు ప్రత్యేకంగా తయారు చేసిన 38 అడుగుల పూతరేకుల గజమాలను చంద్రబాబునాయుడుకు వేశారు. అక్కడ నుంచి పూలవర్షం మధ్య వేలాది మంది అభిమానులు ముందు రాగా చంద్రబాబు మార్కెట్ సమీపంలో ఉన్న సభాస్ధలికి వెళ్లారు. రావులపాలెం బహిరంగ సభ సక్సెస్ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును చంద్రబాబు అభినందించారు.
చిల్లర జగ్గిరెడ్డీ.. ఖబడ్దార్!
ఇక్కడ ఎమ్మెల్యే చిర్ల కాదు.. చిల్లర జగ్గిరెడ్డి. ఇతను చేస్తున్న అవినీతి అక్రమాలు అన్ని ఇన్నీ కావని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేను వస్తున్న మార్గమధ్యలో జొన్నాడ వద్ద పెద్ద ఇసుక గుట్టలు అడవిలా కనిపించాయి. ఎవ్వడ్రా ఈ మహానుభావుడు అనుకున్నా. నేను నేరుగా వెళ్లాను. ఎవ్వరివని ప్రశ్నిస్తే నాగమోహన్‌రెడ్డివి అన్నారు. ఇతను చిల్లర జగ్గిరెడ్డి మనిషి..రోజుకు 400 లారీ లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి..అక్కడే ఉన్న ఓ లారీ డ్రైవర్‌ను ప్రశ్నిస్తే 40 టన్నుల ఇసుకను విశాఖపట్నం తీసుకువెళ్తున్నానని చెప్పాడు. ఇక్కడ నుంచి రోజుకు 10 వేల టన్నుల ఇసుక రవాణా అవుతుంది. గోదావరి ఉన్న రావులపాలెంలో ఇసుక దొరుకుతుందా అని ప్రశ్నించారు. జగ్గిరెడ్డి మరలా రేపు ఉండదు గుర్తుపెట్టుకో.. ఇప్పుడే చూశా నీ అవినీతి గుట్ట. ఖబడ్డార్ జాగ్రత్తగా ఉండు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా గుట్టలు.. గుట్టలు తవ్వావే..దీనికి ఎక్కడ అనుమతి ఉందని... దీనికి కాంట్రాక్టర్ ఎవరు.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోందా.. ఇది ప్రజల సంపద. సహజ వనరులను భగవంతుడు ఇచ్చిన ఇసుకను సైతం నువ్వు దోచేయాలని అనుకుంటున్నావు.నిన్ను ప్రజాకోర్టులో బోను ఎక్కించే బాధ్యత నేను తీసుకుంటా. ఏం తమ్ము ళ్లూ ఈ చిల్లర జగ్గిరెడ్డి అవినీతిని మీరు క్షమిస్తారా.. వదలిపెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ అక్రమ సంపాదనతో రేపు ఓటుకు మీకు రూ.10 వేలు ఇస్తారు.. మీరు ఒటేస్తారా అని అడుగుతున్నా.. మీకు డబ్బులు ఇచ్చి మీ కన్నును మీ వేలితోటే పొడుస్తారు. జగన్మోహన్‌రెడ్డి జే ట్యాక్స్ వేస్తే ఇక్కడ జగ్గిరెడ్డి జే ట్యాక్స్ వేస్తున్నాడు. ఇక్కడ ఏం చే యాలన్నా ఆయన పర్మిషన్ కావాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. విలువైన భూముల విషయంలో వివాదాలు సృష్టించడం, సెటిల్‌మెంట్లు తానే చేయడం పర్సంటేజ్ కొట్టేయడం జగ్గిరెడ్డికే చెల్లింది. కొత్తపేట నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యే చిన్న పనైనా చేశాడా. చేశాడు ఒకేఒక్క పని.. రావులపాలేనికి బార్ తీసుకువచ్చాడు. ఈయనకు రైతులపై కంటే ఇసుక ర్యాంపులపైనే ప్రేమ ఎక్కువ. ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తిని మీరు క్షమిస్తారా అంటూ ప్రశ్నించారు. జగ్గిరెడ్డిపై మాత్రం చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆరోపణలు సంధించినప్పుడు సభికుల నుంచి పలుసార్లు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. తొలుత మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సైతం జగ్గిరెడ్డిపై ఆరోపణాస్ర్తాలు సంధించారు.
సర్పంచులం.. ఉత్సవ విగ్రహాలమయ్యాం!
చంద్రబాబుతో ముఖాముఖిలో వారి ఆవేదన
సర్పంచ్‌లకు ఈ ప్రభుత్వంలో విలువ లేదు. ప్రజలకు ఏదో చేద్దామనే ఆశయంతో వచ్చాం. ఏదీ చేయలేకపోయాం. ఉత్సవ విగ్రహాల్లా మిగిలాం. వచ్చిన ఆర్థిక సంఘం నిధులనూ వైసీపీ ప్రభుత్వం కాజేస్తోంది. పారిశుధ్య పనులు నిర్వహించా లన్నా అష్టకష్టాలు పడాల్సిన దుస్థితిలో పంచాయతీలు ఉన్నా యని టీడీపీ అధినేత చంద్రబాబుతో మండపేటలో జరిగిన ముఖాముఖిలో సర్పంచ్‌లు వాపోయారు.
కోటిపల్లి రత్నమాల, తాటిపాక సర్పంచ్, రాజోలు మండలం : గ్రామంలో పారిశుధ్య పనివారలకు జీతాల్లేవు. పారిశుధ్య పనులు చేపట్టాలన్నా, రక్షిత నీటి సరఫరా విభాగాలను మెయింటినెన్స్ చేయాలన్నా డబ్బులు లేవు. గత 20 నెలలుగా ఇలాంటి అత్యవసర పనుల బిల్లులైనా ఇవ్వాలని వేడుకుంటున్నాం. సర్పం చ్‌లు భిక్షమెత్తుకుని జీతాలు ఇవ్వాల్సిన దుస్థితి.
చంద్రబాబు : గ్రామ స్వరాజ్య వ్యవస్థకు మూలాధారమైన పంచాయతీలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఈ దారుణాలను సర్పంచ్‌లే ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల అభివృద్ధి బాధ్యత మేమే తీసుకుంటాం.
బొబ్బా ప్రభాత్‌కుమార్, ఎస్.మూలపొలం, సర్పంచ్, అయినవిల్లి మండలం : మా సమస్యలపై ఆందోళన చేసేం దుకు 150 మంది సర్పంచ్‌ల వరకు ఢిల్లీ వెళ్లాం. అక్కడ ఒక ట్రావెలర్ మీదెక్కడ అని అడిగాడు. ఆంధ్ర అనగానే మీరు విజన్ ఉన్న లీడర్ చంద్రబాబునాయుడిని ఓడించి, నేరగాడిని సీఎంగా ఎన్నుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలతో మేమంతా సిగ్గుపడ్డాం.
చంద్రబాబు : ప్రజలు మంచిపాలన అందించే నాయకుడిని కాకుండా సైకోను సీఎంగా గెలిపించు కున్నారు. ఆ సైకో సర్పంచ్‌లైనా, అధికారులైనా, ప్రజలైనా బాధపడుతుంటే అతడు ఆనందిస్తుంటాడు. ఈసారైనా మీరంతా సంఘటితంగా సైకో సీఎంను ఇంటికి పంపేందుకు సిద్ధంకండి. పంచాయతీ వ్యవస్థను కాపాడే బాధ్యతను నేను తీసుకుంటా.
దాయం కావేరి, కాలేరు సర్పంచ్, కపిలేశ్వరపురం : మా సర్పంచ్‌లకు విలువలేదు. వలంటీర్లు, గృహసారథులను ఏమైనా అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వంలో వలంటీర్లు నాపై దాడి చేయబో యారు. మీరు వలంటీర్ సచి వాలయ వ్యవస్థను ఎలా వినియోగిస్తారు?
చంద్రబాబు : వ్యవస్థల పవిత్రతను కాపాడాలి. సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధ వ్యవస్థ కాదు. అంతా కూడా పంచాయతీ సర్పంచ్ కిందనే పనిచేయాలి. భవిష్యత్‌లో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే అన్ని పనులు జరుగుతాయి.
ముదునూరి శ్రీనివాసరాజు, దిండి సర్పంచ్, రాజోలు మండలం : మా గ్రామంలో దళితవాడలో రెండు కిలో మీటర్ల మేర కూడా సీసీ రోడ్డు వేయలేకపోయా. టీడీపీ ప్రభుత్వంలో వేసిన సీసీ రోడ్లు మీదనే ఇప్పుడు ప్రజాప్రతి నిధులు తిరుగుతున్నారు. నాలుగేళ్లలో గ్రామాలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీలేదు.
చంద్రబాబు : అధికారంలోకి రాగానే పంచాయతీలకు పూర్తి స్థాయిలో అధికారాలు అప్పగిస్తాం. అన్ని రకా లుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లండి. - మండపేట
Updated Date - 2023-08-18T01:25:43+05:30 IST