Cock Fight: కాకినాడ జిల్లాలో కోడి పందేలు, జూదాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు
ABN, First Publish Date - 2023-01-14T11:27:52+05:30
కాకినాడ (Kakinada): జిల్లాలో కోడి పందేలు (Cock Fight), జూదాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు.
కాకినాడ (Kakinada): జిల్లాలో కోడి పందేలు (Cock Fight), జూదాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. కాకినాడ రూరల్‌లోని వలసపాకలో పందేలు వీక్షించేందుకు అధికార పార్టీ నేతలు పాస్‌లు జారీ చేస్తున్నారు. కోడి పందేల బరుల్లో గెలిస్తే బుల్లెట్ వాహనం, కారు బహుమతిగా ఇస్తున్నారు. ఒక్కో పందెంలో రూ. 10 లక్షల వరకు బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ప్రత్తిపాడు మండలం, వొమ్మంగిలో వైసీపీ ఎమ్మెల్యే మేనల్లుడు స్వయంగా బరులు ఏర్పాటు చేశారు.
అలాగే కృష్ణా జిల్లాలో సంక్రాంతి (Sankranti) సందర్భంగా బాపులపాడు మండలం, అంపాపురం గ్రామంలో మూడు ముక్కలాటకు గుడారాలు సిద్ధమయ్యాయి. అంపాపురం పంచాయతీ సిబ్బందితో పనులు ముమ్మరం చేశారు. కోడిపందాల బరువులు వద్ద పంచాయతీ సిబ్బందిని కూడా వాడుకున్నారు. భారీ సెట్టింగ్‌లతో లక్షల రూపాయలు ఖర్చుతో కోడిపందాల బరులు సిద్ధం చేశారు. కోడి పందాల వీఐపీ పాస్ (VIP Pass) ధర రూ.60వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు నిర్వాహకులు వీఐపీ పాసులను సిద్ధం చేస్తున్నారు. గ్రేట్ ఏ, గ్రేట్ బిగా పాసుల ధరలను కోడి పందాల నిర్వాహకులు కేటాయించారు. గ్రేట్ ఏ రూ. 60వేలు, గ్రేట్ బి రూ. 40వేలుగా పిక్స్ చేశారు. వీఐపీ పాస్ తీసుకున్న వారికి మూడు రోజుల పాటు ఫుడ్, క్వాలిటీ లిక్కర్, బెడ్, కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆటగాళ్ల కోసం క్యూ ఆర్ కోడ్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తున్నారు.
Updated Date - 2023-01-14T11:27:56+05:30 IST