ఎండలోనూ.. అర్జీల తాకిడి
ABN, First Publish Date - 2023-06-06T01:27:12+05:30
బొమ్మూరు, జూన్ 5: ఓ పక్కన ఎండ దంచేస్తున్నా జిల్లాలో పలు సమస్యలపై కలెక్టర్‌ను కలిసేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు వస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కలెక్టరేట్ కిటకిటలాడింది. స్పం దన సమావేశ మందిరం లోపల, బయట అర్జీ నమోదు కేంద్రంలో ఒకటే జనం. స్పందనలో జిల్లా, మండల స్థాయి అధికారులు 50 మంది వరకూ అందుబాటులో ఉంటారు. ఇంతమందిలోనూ అర్జీ దారులు కలెక్టర్, జేసీ, డీ
బొమ్మూరు, జూన్ 5: ఓ పక్కన ఎండ దంచేస్తున్నా జిల్లాలో పలు సమస్యలపై కలెక్టర్‌ను కలిసేందుకు ప్రజలు కలెక్టరేట్‌కు వస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కలెక్టరేట్ కిటకిటలాడింది. స్పం దన సమావేశ మందిరం లోపల, బయట అర్జీ నమోదు కేంద్రంలో ఒకటే జనం. స్పందనలో జిల్లా, మండల స్థాయి అధికారులు 50 మంది వరకూ అందుబాటులో ఉంటారు. ఇంతమందిలోనూ అర్జీ దారులు కలెక్టర్, జేసీ, డీఆర్వోలకు సమస్యలు వివరిస్తారు. సోమవారం స్పందనకు అధికంగా రావడంతో సమావేశ మందిరం కిక్కిరిసింది. ఒకే సమస్యపై కొంతమంది ఒకేసారి వస్తుండడంతో ప్రతి వారం ఇదే రద్దీ కనిపిస్తోంది. ఈసారి జరిగిన స్పందనలో కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్, సహాయ కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్ది, డీఆర్వో నరసింహులు 89 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ అర్జీని కుటుంబ సభ్యుల సమస్యగా భావించి పరిష్కారం చూపాలన్నారు. 1902 ద్వారా వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను సూచించారు.
ఆ పరిశ్రమ వద్దు!
రంగంపేట, జూన్ 5 : అనపర్తి నియోజకవర్గం లోని రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంతో పాటు పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో ఉన్న జి.కొత్తూరు, చిన్న బ్రహ్మదేవం, ఆర్బీపట్నం, కొండపల్లి గ్రామాల రైతులు గోదావరి బయో మెడికల్ పరిశ్రమ అనుమతులను రద్దుచేయాలని, ఈ గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడాలని కలెక్టర్ మాధవీలతకు సోమవారం స్పందనలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రిమ్మలపూడి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మాట్లాడుతూ 2022 డిసెంబర్ నెలలో పరిశ్రమ అనుమతులు రద్దు అయ్యాయన్నారు. యాజమాన్యం అనుమతులను రెన్యూవల్ చేయాలని కోరుతూ అధికారుల వద్దకు తిరుగుతున్నట్టు సమాచారం తెలిసిందని, దాంతో బయో మెడికల్ పరిశ్రమ అనుమతులు మళ్లీ రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించిన వారిలో వేము చిరంజీవి, మేడిద చక్రం, పుట్ట వెంకటేశ్, సీహెచ్ రాంబాబు, ఎ.నానాజీ. బి.వెంకన్న, ఎ.సోమరాజు, పలివెల రామకృష్ణ, ఎన్ ఏసుబాబు, కె.కాశి తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-06-06T01:27:12+05:30 IST