Harshakumar: చంద్రబాబుని జగన్, సజ్జల ఇబ్బందులకు గురిచేస్తున్నారు
ABN, First Publish Date - 2023-10-18T14:31:47+05:30
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుని సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు (Chandrababu)ను సీఎం జగన్ (Jagan), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పర్యవేక్షిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ (Harshakumar) అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా చంద్రబాబుని ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ముఖ్యమంత్రి కక్ష సాధింపు ధోరణి విడనాడాలన్నారు. చంద్రబాబుని జైలులో పెట్టిన తర్వాత ప్రజా సమస్యలపై ఎవరూ మాట్లాడటం లేదని, రాష్ట్ర సంపదను జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు.
రాజోలు తీరప్రాంతం అంతా అసైన్డ్ భూములేనని, గత నెలలో సజ్జల వచ్చి అంతర్వేది ప్రాంతాన్ని పరిశీలించారని, ఒక సూట్ కేసు కంపెనీ భూములు కావాలని దరఖాస్తు చేసుకుందని హర్షకుమార్ అన్నారు. ఓఎన్జీసీకి చెందిన రెండు బావులను అబివృద్ది చేసేందుకు 24.8 చదరపు కిలోమీటర్లలో ఆరు వేల ఎకరాలు కావాలని దరఖాస్తు చేసిందన్నారు. దీంతో కేశనపల్లిలో సొసైటీ భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరించారని, ఆరు వేల ఎకరాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైందన్నారు. జగన్, సజ్జలకు చెందిన సూట్ కేసు కంపెనీకు భూములు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని, అన్ని సొసైటీలు కూడా భూములు ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయన్నారు. రెండు ఎకరాల విస్తర్ణంలో ఉన్న బోరు బావుల కోసం ఆరు వేల ఎకరాలు భూములు బలవంతంగా లాక్కోవటం దుర్మార్గమని హర్షకుమార్ అన్నారు.
Updated Date - 2023-10-18T14:31:47+05:30 IST