MLA Gorantla: తారకరత్న మృతిపై ఆరోపణలు...
ABN, First Publish Date - 2023-02-21T12:23:55+05:30
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP MLA Gorantla Butchaiah Choudary) వైకాపా ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (TDP MLA Gorantla Butchaiah Choudary) వైకాపా ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మానవత్వంలేని వైసీపీ పశువులు తారకరత్న (Tarakaratna) మృతిపైనా ఆరోపణలు చేస్తున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రాక్షస విధానాలతో రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, ఏపీలో రోజూ హత్యలు జరుగుతున్నాయని, ప్యాక్షన్ రాజకీయాలతో హత్యలు చేస్తున్నారని విమర్శించారు.
గత 60 ఏళ్లలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ నాలుగేళ్లలో ఏ విధమైన అభివృద్ది చేయలేదని విమర్శించారు. జీవో 1 (GO 1) అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి బుద్ది ఉందా? అని ప్రశ్నించారు. పోలీసులు రోడ్డు మీద ధర్నా చేయటం దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు (Chandrababu)ను అంతమెందించాలనే దురుద్దేశ్యంతో జగన్ ఉన్నారని, బాబు పర్యటన, లోకేష్ (Lokesh) పాదయాత్ర (Padayatra) చూసి జగన్ ఉచ్చపోసుకుంటున్నారని అన్నారు. పర్మిషన్ ఇచ్చి కేసులు పెడతారా?... బిక్కవోలులో వెయ్యి మంది టీడీపీ శ్రేణుల (TDP Leaders)పై కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారని, చంద్రబాబు పిలుపు ఇస్తే పదివేల మందితో జగన్ ఇల్లు ముట్టడిస్తామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సీఎం జగన్‌కు తొత్తులుగా వ్యవహరించే పోలీసులకు ఇదే హెచ్చరికా... ప్రభుత్వ అవినీతి అక్రమాలపై ప్రజలు, ఉద్యోగులు తిరగబడతారన్నారు. కోర్టులను కూడా ప్రభావితం చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, మీడియాను కూడా నియంత్రణ చేస్తున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీ టీడీపీ టిక్కెట్‌తో గెలిచారని... ఇప్పుడు టీడీపీపై దాడి చేసి హీరో అవుదామనుకొని జీరో అవుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు.
కాగా నిన్న సాయంత్రం నుంచి తన భర్త పట్టాభి కనిపించడం లేదని పోలీసులకు రాత పూర్వకంగా భార్య చందన ఫిర్యాదు చేశారు. అయితే గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. పోలీసులు గన్నవరం వెళ్ళనివ్వడం లేదు కాబట్టి ఇంటి దగ్గర పడమట సిఐ కాశీ విశ్వనాధ్‌కు చందన ఫిర్యాదు లెటర్ అందజేశారు.
Updated Date - 2023-02-21T12:23:59+05:30 IST