ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థి ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-02-12T01:45:19+05:30

అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల విద్యార్థి మోర్త సోహిత్‌ రాజ్‌వర్ధన్‌ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మృతి చెందినట్టు ఆరోపిస్తూ తల్లిదండ్రులు, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు.

గురుకులం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పీడీఎస్‌యూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోడి గురుకుల పాఠశాల వద్ద తల్లిదండ్రులు, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన

అల్లవరం, ఫిబ్రవరి 11: అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల విద్యార్థి మోర్త సోహిత్‌ రాజ్‌వర్ధన్‌ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మృతి చెందినట్టు ఆరోపిస్తూ తల్లిదండ్రులు, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల గేటు వద్ద ధర్నా చేశారు. ఈ నెల నాల్గవ తేదీన ఆరవ తరగతి విద్యార్థి రాజ్‌వర్ధన్‌ పల్లంకుర్రులో స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మురుగునీరు బయటకు పోయే మార్గం లేక కలుషిత నీటితో స్నానాలకు ఇబ్బంది పడుతు న్నా, చర్మ వ్యాధులతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడినా సాం ఘిక సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పాఠశాల కమిటీల చైర్మన్లు కోట హనుమంతరావు, పొలమూరి మోహన్‌, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, విద్యార్థి తండ్రి మోర్త వెంకటశ్రీహరి తదితరుల ఆధ్వర్యంలో ధర్నా చేసి నిరసన వ్యక్తంచేశారు. విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు స్పష్టంచేశారు. సాంఘిక సంక్షేమశాఖ జిల్లా కోఆర్డినేటర్‌, సంబంధిత మంత్రికి మొరపెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. విద్యార్థి ఆత్మహత్యపై విచారణ జరపలేదన్నారు. పేద విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని తిరుపతిరావు ఆరోపించారు. పాఠశాల సమస్యలు తీరేవరకు ఆందోళన చేస్తా మన్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన విద్యార్థి తండ్రి మోర్త వెంకటశ్రీహరి, ముత్తాబత్తుల శ్రీను, జొన్నాడ శ్రీనివాస్‌, కె.విజయకుమారి ఆందోళనలో పాల్గొన్నారు. ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2023-02-12T01:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising