ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐదేళ్లలో జరిగిన అవకతవకలెన్ని!

ABN, First Publish Date - 2023-09-06T00:46:03+05:30

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా.. అలాగే ఉన్నతాధికారులు తలచుకుంటే సంవత్సరాల కిందట జరిగిన అవకతవలకలనైనా విచారణ చేపట్టి సంబందిత అధికారులపై చర్యలు చేపట్టవచ్చు.

డీఎల్‌డీవో జారీ చేసిన ప్రొసీడింగ్‌ కాపీ

రికార్డుల వెరిఫికేషన్‌కు కలెక్టర్‌ ఆదేశం

రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్‌

రాజమహేంద్రవరం రూరల్‌ సెప్టెంబరు 5 : రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా.. అలాగే ఉన్నతాధికారులు తలచుకుంటే సంవత్సరాల కిందట జరిగిన అవకతవలకలనైనా విచారణ చేపట్టి సంబందిత అధికారులపై చర్యలు చేపట్టవచ్చు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పరిధిలో కోలమూరు, పిడింగొయ్యి, హుకుంపేట, బొమ్మూరు గ్రామాల్లో గత ఐదేళ్ల నుంచి వసూలు చేసిన ఆస్తి పన్ను రికార్డులను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ డా. కె.మాధవీలత ఆదేశాలు జారీచేశారు. దీనిపై హుకుంపేట, బొమ్మూరు గ్రామాలకు సంబంధించి రాజమహేంద్రవరం డీఎల్‌డీవో వీణాదేవి, కోలమూరు, పిడింగొయ్యి గ్రామాలకు సంబంధించి కొవ్వూరు డీఎల్‌డీవో శాంతామణిలు ఆయా గ్రామాల కార్యద ర్శులకు నోటీసులు జారీచేశారు. పలు గ్రామాలకు చెందిన కార్యదర్శులను సపోర్టింగ్‌ టీం గా నియమించారు. మంగళవారం కోలమూరు, బొమ్మూరు గ్రామాల్లో సంబంధిత అధికారులు రికార్డుల వెరిఫికేషన్‌ ప్రారంభించారు. గత ఐదేళ్లుగా కోలమూరు, పిడింగొయ్యి, హుకుంపేట, బొమ్మూరు తదితర గ్రామాలకు సంబంధించి వసూలు చేసిన ఆస్తిపన్ను, పంచాయతీలలో జమా ఖర్చులు, ప్రతి సంవత్సరం నిర్వహించే ఆడిట్‌లో అవకతవకలు జరిగాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదు అం దింది.ఈ మేరకు విచారణకు ఆదేశించినట్టు సమా చారం. అయితే ఆస్తి పన్ను వసూళ్లపైనే కాకుండా పంచాయతీల్లో నిర్వహించిన అన్ని రకాల జమ ఖర్చులపై కూడా విచారణ చేపడితే మరింత పారదర్శకంగా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-06T00:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising