Pawan Kalyan: రాజమండ్రి నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా...రైతులపై చెయ్యేస్తే..
ABN, First Publish Date - 2023-05-11T13:52:01+05:30
అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
రాజమండ్రి: అన్నంపెట్టే రైతు తరచూ కన్నీరు పెడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. రాజమండ్రి పర్యటనలో భాగంగా ఆయన గురువారం జనసేన నూతన కార్యాలయంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. తెలంగాణ విభజన జరిగినప్పటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలు పచ్చగా ఉంటాయన్నారని తెలిపారు. అయితే క్షేత్ర స్తాయి పర్యటనలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవటం, వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించకపోవటం, ముఖ్యమంత్రి స్పందించకపోవటం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. రుణమాఫీ వద్దని... పావలా వడ్డీకి ఎకరానికి 25 వేలు రుణం ఇస్తే సరిపోతుందని రైతులు చెబుతున్నారని తెలిపారు. గోనె సంచులు ఇవ్వకపోవటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ గింజ కొనుగోలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. జనసేనకు ఆవేదన చెప్పిన రైతులను వేదిస్తే వైసీపీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందన్నారు. ‘‘రాజమండ్రి నడిబొడ్డు నుంచి హెచ్చరిస్తున్నా... రైతులపై లాఠీచార్జీలు చేసినా, బైండోవర్ కేసులు పెట్టినా వైసీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Updated Date - 2023-05-11T13:52:01+05:30 IST