ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీచ్‌.. అభివృద్ధి తూచ్‌

ABN, First Publish Date - 2023-03-09T01:12:06+05:30

కాకినాడ బీచ్‌కు గ్రహణం వీడడం లేదు. పర్యాటకపరంగా అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంలో అసలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. బీచ్‌లో వాటర్‌స్పోర్ట్స్‌తోపాటు అనేక జలక్రీడలు, వినోదం అందుబాటులోకి తీసుకువస్తే విశాఖ బీచ్‌ తరహాలో ఆదరణ వచ్చే అవకాశం ఉన్నా దృష్టిసారించడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏళ్లు గడుస్తున్నా కాకినాడ బీచ్‌ అభివృద్ధి కలే

అదిగో ఇదిగో అంటూ పర్యాటక సంస్థ అదేపనిగా ఊదరింపు

నాలుగేళ్లుగా ఒక్క అడుగూ ముందుకు పడని వైనం

వాటర్‌ స్పోర్ట్స్‌, బీచ్‌ అభివృద్ధికి ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా విఫలమే

మళ్లీ ఇప్పుడు బ్లుఫ్లాగ్‌ ‘కాకినాడ బీచ్‌ ప్రాజెక్టు’ పేరుతో ఇంకో ప్రయత్నం

బీచ్‌ను అభివృద్ధికి రెండేళ్ల కిందే కేంద్రం అంగీకారం

అన్ని వసతులు కల్పిస్తే ఏటా రూ.10కోట్ల వరకు ఇవ్వడానికి సుముఖం

గాలికి వదిలేసిన ప్రభుత్వం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడ బీచ్‌కు గ్రహణం వీడడం లేదు. పర్యాటకపరంగా అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కనీస వసతులు కల్పించడంలో అసలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. బీచ్‌లో వాటర్‌స్పోర్ట్స్‌తోపాటు అనేక జలక్రీడలు, వినోదం అందుబాటులోకి తీసుకువస్తే విశాఖ బీచ్‌ తరహాలో ఆదరణ వచ్చే అవకాశం ఉన్నా దృష్టిసారించడంలేదు. పేరుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కాకినాడ బీచ్‌ను అలా చేస్తాం.. ఇలా చేస్తాం.. అంటూ కాగితాలపై నాలుగేళ్లుగా జిమ్మిక్కులు ప్రదర్శిస్తోంది. తీరా ఒక్క రూపాయి కూడా విదల్చకపోవడంతో వెక్కిరిస్తోంది. కాకినాడ బీచ్‌ అభివృద్ధికి పీపీపీ పద్ధతిలో ఇప్పటివరకు అనేక టెండర్లు పిలిచినా సర్కారుపై నమ్మకం లేక ఒక్కరంటే ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మళ్లీ బ్లూఫ్లాగ్‌ బీచ్‌గా కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేయడం కోసం ఆలోచనలతో రావాలంటూ బిడ్లు ఆహ్వానిస్తూ ఇంకో నాటకానికి తెరలేపడం విమర్శలకు దారితీస్తోంది. వాస్తవానికి కాకినాడ బీచ్‌ను కనీసస్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చేస్తే తనవంతుగా ఏటా రూ.10కోట్లు ఇవ్వడానికి కేంద్రం ముందుకు వచ్చింది. అయినా రాష్ట్రంనుంచి చొరవ లేకపోవడంతో కేంద్రం పట్టించుకోవడం మానేసింది.

వెళ్లాలంటే భయం...

పేరుకు కాకినాడ నగరం సముద్రతీరానికి ఆనుకుని ఉన్నా పర్యాట కం పుంజుకోలేదు. ఇక్కడ నగరవాసులు బీచ్‌కు వెళ్లాలంటే పది కిలో మీటర్లు ప్రయాణించాలి. పోనీ దూరా భారమైనా వెళ్తే అక్కడ కనీస వసతులు లేవు. సరైన రహదారి లేదు. చీకటైతే లైటింగ్‌ సదుపాయం లేదు. బీచ్‌లో స్నానాలు చేస్తే దుస్తులు మార్చుకోవడానికి గదులు లేవు. తినడానికి పర్యాటక హోటల్స్‌ గానీ, ఏదైనా ప్రమాదం సంభ విస్తే ఆదుకోవడానికి ఈతగాళ్లు, ఇతర వైద్య సదుపాయాలు అసలేం లేవు. అన్నింటికీమించి కుటుంబంతో ఎవరైనా బీచ్‌కు వెళ్తే రాత్రయితే ఆకతాయిల బెడద.. రాకపోకలకు రవాణా సదుపాయం కూడా తక్కు వ. దీంతో కాకినాడ బీచ్‌ పేరుకు మాత్రమే మిగిలింది. ఇక్కడ బీచ్‌ను అభివృద్ధి చేస్తే వేలల్లో పర్యాట కులు పోటెత్తే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలే దు. దీంతో కొందరు పర్యాట కులు సాహసిస్తూ ఆదివారం వెళ్లి చీకటి పడేలోపు మళ్లీ భ యంతో వెనక్కు వచ్చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖలో అనేక బీచ్‌లో అన్నిరకాల సదుపాయా లుండగా, ఇక్కడ అవన్నీ దిగ దుడుపే. ఈ నేపథ్యంలో కాకి నాడ బీచ్‌లో అన్ని వసతులు కల్పించడానికి ప్రయత్నిస్తున్న ట్లు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నాలుగేళ్ల నుంచీ మాటలు చెబుతోంది. కానీ అవేవీ కాగితాలను దాటడం లేదు. గతంలో కాకినాడ బీచ్‌లో లైటింగ్‌, పార్కిం గ్‌, స్నానపు గదులు, వాటర్‌స్పోర్ట్స్‌, పార్కు అభివృద్ధి చేయడానికి పీపీపీ పద్ధతిలో టెం డర్లు ఆహ్వానించింది. ప్రైవేటు వ్యక్తులు వచ్చి సొంతంగా బీచ్‌ అభివృద్ధి చేసుకోవాల ని, అలా వచ్చే ఆదాయంతో తమకు వాటా ఇవ్వాలని షరతు విధించడంతో ఒక్కరంటే ఒక్కరూ కూడా కన్నెత్తి చూడలేదు. ఆ త ర్వాత కూడా పలుసార్లు ఇదే తరహా ఆలో చనతో టెండర్లు పిలిచినా స్పందన లేదు. దీంతో నాలుగేళ్లుగా కాకినాడ బీచ్‌లో పిసరం త అభివృద్ధి కూడా జరగలేదు. మరోపక్క కుడా తన వంతుగా ఇక్కడ బీచ్‌ను కొంతైన అభివృద్ధి చేయడానికి చెన్నైలో యుద్ధ విధుల నుంచి తప్పుకున్న రెండు వాయుసేన విమానాలను తెచ్చింది. పార్కు తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది. తీరా రాష్ట్రప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా కుడాను ఇప్పటికి ముప్పుతిప్పలు పెడుతోంది.

మళ్లీ అదే పాట..

ఈ పరిస్థితుల్లో మళ్లీ ఇప్పుడు పర్యాటక అభివృద్ధి సంస్థ కాకినాడ బీచ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు పేరుతో ఔత్సాహికులనుంచి ప్రాజెక్టును ఆహ్వానించడం విమర్శలకు దారితీస్తోంది. కొత్త ప్రతిపాదన కింద కాకినాడ బీచ్‌లో రెస్టారెంట్స్‌, వాటర్‌స్పోర్ట్స్‌, వ్యూ పాయింట్‌, ప్లేఏరియా ఫర్‌ చిల్డ్రన్‌, టూరిస్ట్‌ రిసప్షన్‌ సెంటర్‌, రెస్క్యూ, మెడికల్‌ సెంటర్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, సీటింగ్‌, పార్కింగ్‌ సదుపాయాలను ఎలా కల్పించాలి? ఎక్కడెక్కడ ఏం అభివృద్ధి చేస్తే బాగుంటుందో ఆలోచనలతో రావాలని బిడ్‌ నిబంధనల్లో పొందుపరిచింది. ప్రభుత్వం తరఫున బీచ్‌ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఏపీటీడీసీ ఖర్చు చేయదట. ఎవరికివారే కొత్త ఆలోచనలతో వచ్చి బీచ్‌ అభివృద్ధి చేయాలంటూ ఈ బిడ్లు పిలవడం కాకినాడ బీచ్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పటిలాగే ఈ ప్రతిపాదనకు కూడా ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేయడానికి కేంద్రం రెండేళ్ల కిందటే ఆసక్తి చూపించింది. కేంద్ర పర్యాటకశాఖ అధికారులు వచ్చి బీచ్‌రోడ్డులో మూడుచోట్ల పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ బీచ్‌ను అభివృద్ధి చేస్తే తమ వంతు ఏటా బ్లూఫ్లాగ్‌ బీచ్‌ అభివృద్ధి కింద ఏటా రూ.10కోట్ల వరకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. కానీ రాష్ట్రంనుంచి ఏమాత్రం చొరవ లేకపోవడంతో కాకినాడ బీచ్‌ అభివృద్ధి లేక ఈసురోమంటోంది.

Updated Date - 2023-03-09T01:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising