ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీతోనే మహిళల అభ్యున్నతి

ABN, First Publish Date - 2023-07-28T23:49:41+05:30

కాకినాడ సిటీ, జూలై 28: మహిళల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, వైసీపీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నా రు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగ ంగా శుక్రవారం 8వ డివిజన్‌ కొత్త కాకినాడలో కొండబాబు పర్యటించి టీడీపీ అమలు చేసే మహాశక్తి మేని

కాకినాడలో మహిళలకు వివరిస్తున్న కొండబాబు

మాజీ ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ సిటీ, జూలై 28: మహిళల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని, వైసీపీ పాలనలో మహిళలపై దాడులు పెరిగాయని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నా రు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగ ంగా శుక్రవారం 8వ డివిజన్‌ కొత్త కాకినాడలో కొండబాబు పర్యటించి టీడీపీ అమలు చేసే మహాశక్తి మేనిఫెస్టో పథకాన్ని మహిళలకు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం టీడీపీ మహాశక్తి సంక్షేమ పఽథకాలను ప్రకటిం చిందన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, సీకోటి అప్పలకొండ, మమతా శ్రీనివాస్‌, దాసరి సత్యవతి, ఇల్లా గోవిందమ్మ, మోసా దుర్గమ్మ, చోడిపిల్లి అమ్మోరమ్మ, చొక్కా బాబూ రావు, బడే సత్యారావు తదితరులు ఉన్నారు.

ఇర్రిపాకలో మహిళా శక్తి యాత్ర

జగ్గంపేట రూరల్‌, జూలై 28: మండలంలోని ఇర్రిపాకలో శివాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో మహాశక్తి రథయాత్ర కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ ప్రారం భించి కృష్ణవరం చేరుకున్నారు. నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ ప్రకటించిన మహిళా శక్తి పథకం రాష్ట్ర చరిత్రలోనే మహిళలకు అత్యంత ఉపయోగకరమైన పథకమన్నారు. నవీన్‌ మా ట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మహిళల కు సూచించారు. కార్యక్రమంలో 4 మండలాల టీడీపీ అధ్యక్షులు చదరం చంటిబాబు, మారి శెట్టి భద్రం, పోతుల మోహన్‌రావు, మంగా రౌతు రామకృష్ణ, కోర్పు సాయితేజ్‌, పైడిపాల సూరిబాబు, బొద్దిరెడ్డి సుబ్బారావు, ఆడపా భరత్‌, కన్నబాబు, వీరంరెడ్డి కాశీబాబు, నకిరెడ్డి సూర్యవతి, అమ్మాజీ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-28T23:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising