ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెత్తచెదారాలు లేకుండా శుభ్రపరచాలి

ABN, First Publish Date - 2023-02-16T00:20:37+05:30

పట్టణంలోని కుమార రామ భీమేశ్వరాలయం ఆవరణలో కోనే రు పుష్కరిణి, గోదావరి పుష్కరిణిలను చెత్తచెదారాలు లేకుండా తక్షణం పరిశుభ్రపరచాలని కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ దేవదాయశాఖాధికారు లు, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనుండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆర్డీవో, తహశీల్దార్‌ కుమారితో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించి ఆంధ్రజ్యోతి కథనాలకు తీవ్రంగా స్పందించారు. అలసత్వం కూడదని సిబ్బందిని ఆర్డీవో హెచ్చరించారు. పుష్కరిణిలో

సామర్లకోటలో ఏర్పాట్లపై మాట్లాడుతున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ ఆర్డీవో రమణ

మహాశివరాత్రికి ఆలయాల్లో ఏర్పాట్ల పరిశీలన

సామర్లకోట, ఫిబ్రవరి 15: పట్టణంలోని కుమార రామ భీమేశ్వరాలయం ఆవరణలో కోనే రు పుష్కరిణి, గోదావరి పుష్కరిణిలను చెత్తచెదారాలు లేకుండా తక్షణం పరిశుభ్రపరచాలని కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ దేవదాయశాఖాధికారు లు, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనుండడంతో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆర్డీవో, తహశీల్దార్‌ కుమారితో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించి ఆంధ్రజ్యోతి కథనాలకు తీవ్రంగా స్పందించారు. అలసత్వం కూడదని సిబ్బందిని ఆర్డీవో హెచ్చరించారు. పుష్కరిణిలో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొ లగించాలన్నారు. భక్తులు స్నానమనంతరం దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు కలుగజేయాలన్నారు. మరిన్ని క్యూలు ఏర్పాటుచేసి ఎండ తగులకుండా ఏర్పాట్లును చే యాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం చర్యలను సత్వరం పూర్తిచేయాలన్నారు. దాతల సహకారంతో భక్తులకు ప్రసాదవితరణ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా దేవదాయాధికారి పులి నారాయణ మూర్తి, ఆలయ ఈవో డి.నాగమల్లేశ్వరరావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, వీఆర్వోలు ఎన్‌ మురళీకృష్ణ, నూతలపాటి లోవరాజు, జయబా బు, అనుసూరి సత్యనారాయణలు పాల్గొన్నారు.

సమన్వయంతో ఏర్పాట్లు

పిఠాపురం, ఫిబ్రవరి 15: పిఠాపురం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందు న అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పా ట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో బీవీ.రమణ ఆదేశించారు. పాదగయలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పాదగయ పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరించే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. క్యూలైన్లు ఎక్కువ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు జరగాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పారు. ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఉత్సవాలు జరిగే అన్నిరోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా దేవాదాయశాఖాధికారి పులి నారాయణమూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రామ్మోహన్‌, తహశీల్దార్‌ పితాని త్రినాధరావు, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌, ఆల య ఈవో వడ్డి శ్రీనివాసరావు తదితరులున్నారు.

Updated Date - 2023-02-16T00:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising