ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధిగా రహదారి భద్రతా నిబంధనలు పాటించాలి

ABN, First Publish Date - 2023-05-16T23:55:32+05:30

సర్పవరం జంక్షన్‌, మే 16: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విధిగా రహదారి భద్రతా నిబంధనలు పాటించి, ప్రయాణికుల భద్రతకు కృషి చేయాలని కాకినాడ ఎస్‌డీపీవో పడాల మురళీకృష్ణారెడ్డి కోరారు. మంగళవారం సర్పవరం జంక్షన్‌ స్పందన ఫంక్షన్‌ హాల్లో సర్పవరం పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ రూల్స్‌పై ఆటోడ్రైవర్లు, ట్యాంకర్‌ లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గమ్యస్థానా

సమావేశంలో మాట్లాడుతున్న మురళీకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ ఎస్‌డీపీవో పడాల మురళీకృష్ణారెడ్డి

సర్పవరం జంక్షన్‌, మే 16: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం విధిగా రహదారి భద్రతా నిబంధనలు పాటించి, ప్రయాణికుల భద్రతకు కృషి చేయాలని కాకినాడ ఎస్‌డీపీవో పడాల మురళీకృష్ణారెడ్డి కోరారు. మంగళవారం సర్పవరం జంక్షన్‌ స్పందన ఫంక్షన్‌ హాల్లో సర్పవరం పోలీ్‌సస్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ రూల్స్‌పై ఆటోడ్రైవర్లు, ట్యాంకర్‌ లారీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అధిక ప్రయాణికులు ఆటోలపై రాకపోకలు సాగిస్తున్నారన్నారు. డ్రైవింగ్‌ చేసే స మయంలో మనతో పాటూ ఎందరో కుటుంబాల ప్రాణాలు మన డ్రైవింగ్‌లో ఆధారపడి ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్‌ చేయరాదని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ముందు సీట్లో ఎవర్నీ ఎక్కించుకోరాదన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లిగోల్డెన్‌ అవర్‌లో తీసుకెళ్లి ప్రాణదాతలు కావాలని కోరారు. ప్రాణం కాపాడిన వారికి కేంద్రం గుడ్‌ సమారిటన్‌ కింద రూ.5వేలు నగదు ప్రోత్సాహక బహుమతి అందిస్తారని తెలిపారు. సర్పరం సీఐ ఆకుల మురళీకృష్ణ ట్రాఫిక్‌ నిబంధనలు, డ్రైవింగ్‌, హెల్మెట్‌ ధారణ, సామర్థ్యానికి మించి ప్రయాణికలును ఎక్కించుకోవడం వల్ల జరి గే ప్రమాణాలు, ప్రాణనష్టంపై అవగాహన కల్పించారు. కాకినాడ రూరల్‌, సిటీ ఆటోయూనియన్ల సంఘం అధ్యక్షులు పలివెల విజయ్‌కుమార్‌, పోసిన నాగ వెంకట రామ న్న దొర, వై.కొండలరావు, సూరిబాబు తదితరులున్నారు.

Updated Date - 2023-05-16T23:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising