పోలీసులు ఆరోగ్యంగా ఉండాలి
ABN, First Publish Date - 2023-03-12T00:12:37+05:30
పోలీసులు శారీరకం గా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు ఆకాంక్షించారు. జిల్లాలో పనిచేస్తోన్న పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి అప్రమత్తం చేస్తూ వైద్య సలహాలు అందించేందుకు రూపొందించిన హెల్దీకాప్ యాప్
ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
కాకినాడ క్రైం, మార్చి 11: పోలీసులు శారీరకం గా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు ఆకాంక్షించారు. జిల్లాలో పనిచేస్తోన్న పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి అప్రమత్తం చేస్తూ వైద్య సలహాలు అందించేందుకు రూపొందించిన హెల్దీకాప్ యాప్ పనితీరుపై గుంటూరు నెఫ్రాలజిస్ట్ డా.చింతా రామకృష్ణ పోలీస్ సిబ్బందికి శనివారం అవగాహన కల్పించారు. ఆ కార్యకమ్రాన్ని ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసులకు వివరించారు. ఈ యాప్ ద్వారా సిబ్బంది ఆరోగ్య సమస్యలకు సంబంధించి అనేక సందేహాలను నివృత్తి చేసుకోవడమే కాకుండా ఆరోగ్యదాయకంగా ఉండేందుకు నిష్ణాతులైన వైద్యుల నుంచి అనేక వైద్య సలహలు, సూచనలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ ఎం.అంబికా ప్రసాద్, జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పోతుల సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-12T00:12:37+05:30 IST