సంక్రాంతిని ఆనందంగా గడుపుదాం
ABN, First Publish Date - 2023-01-05T00:18:03+05:30
సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుదామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. పట్టణంలోని పాదగయ క్షేత్రం ఎదురు గా సర్కిల్ కార్యాలయం వెనుకభాగంలో పోలీసు క్రీడామైదానంలో వారం రోజులు నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు, క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గంగిరెద్దు లు, ఆవులు, గొర్రెలు, మేకల
ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
పిఠాపురం, జనవరి 4: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుదామని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అన్నారు. పట్టణంలోని పాదగయ క్షేత్రం ఎదురు గా సర్కిల్ కార్యాలయం వెనుకభాగంలో పోలీసు క్రీడామైదానంలో వారం రోజులు నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి సంబరాలు, క్రీడాపోటీలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన గంగిరెద్దు లు, ఆవులు, గొర్రెలు, మేకల ప్రదర్శన, గొబ్బెమ్మలు, రంగవల్లులు, బోగిమంటలు, గ్రామీణ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ఆకట్టుకున్నాయి. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నికాయిట్, మహిళలకు మ్యూజికల్ చైర్స్ పోటీలు ముగిశాయి. విజేతలకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు షీల్డులు బహుకరించారు. చిన్నారులకు ఎస్పీ, ఎమ్మెల్యేలు భోగిపండ్లు వేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్, సత్యనారాయణ, కాకినాడ డీఎస్పీ పడాల మురళీకృష్ణారెడ్డి, ఎస్‌బీ, ఎస్సీఎస్టీసెల్ డీఎస్పీలు అంబికాప్రసాద్, బి.అప్పారావు, పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - 2023-01-05T00:18:04+05:30 IST