టూరిస్ట్ పోలీసు అవుట్‌పోస్టుతో సేవలు
ABN, First Publish Date - 2023-02-09T23:56:25+05:30
దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వద్ద ఏపీ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న టూరిస్ట్ పోలీసు అవుట్‌పోస్టు ద్వారా భక్తులకు సమాచారంతో పాటు సేవలు అందిస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు తెలిపారు. పాదగయ వద్ద నూతనంగా
జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు
పాదగయలో మహాశివరాత్రి బందోబస్తుపై సమీక్ష
పిఠాపురం, ఫిబ్రవరి 9: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వద్ద ఏపీ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న టూరిస్ట్ పోలీసు అవుట్‌పోస్టు ద్వారా భక్తులకు సమాచారంతో పాటు సేవలు అందిస్తామని జిల్లా ఎస్పీ రవీంద్రనాఽథ్‌బాబు తెలిపారు. పాదగయ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న టూరిస్టు పోలీసు అవుట్‌పోస్టు భవన నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. డీజీపీ కేవీ రాజేంద్రనాధ్‌రెడ్డి ఆదేశాలతో నిర్మిస్తున్న ఈ టూరిస్ట్ పోలీసు అవుట్‌పోస్టు ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిఠాపురం పుణ్యక్షేత్రానికి తరలివచ్చే భక్తులకు సమాచారంతో పాటు పోలీసు సంబంధిత సేవలు అందించడంలో సహకారం ఇస్తామని వివరించారు. నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాల్లో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎస్పీ వెంట ఎస్‌బీ డీఎస్పీ అంబికాప్రసాద్, పిఠాపురం పట్టణ, రూరల్, కొత్తపల్లి, గొల్లప్రోలు ఎస్‌ఐలు జగన్మోహన్, అబ్థుల్‌నబీ, రామలింగేశ్వరరావు, వినయప్రతాప్, పాదగయ చైర్మన్ ఆగంటి ప్రభాకరరావు ఉన్నారు.
Updated Date - 2023-02-09T23:56:26+05:30 IST