ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులను సత్వరం పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-05-24T23:57:10+05:30

గొల్లప్రోలు, మే 24: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన బుధవారం గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశా రు. రికార్డులు, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాల

పిఠాపురంలో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌

గొల్లప్రోలు, మే 24: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన బుధవారం గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశా రు. రికార్డులు, స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో సిబ్బ ంది కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని, ఏఎస్‌ ఐను నియమిస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా పోలీసుశాఖలో త్వరలో సాధారణ బదిలీలు జరుగుతాయని, ఎవ్వరు ఏ పైరవీలు చేయవలసిన అవసరంలేదని స్పష్టం చేశారు. సిబ్బంది కోరుకున్న చోటఖాళీలు ఉంటే కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీలు చేస్తామన్నారు. గొల్లప్రోలు ఎస్‌ఐ వినయప్రతాప్‌ తదితరులున్నారు.

ప్రత్యేక నిఘా ఉంచాలి

పిఠాపురం: జూదాలు, కోడిపందేలు తదితర అసాంఘిక కార్యాకలాపాలు జరగకుండా ప్రత్యే క నిఘా ఉంచాలని ఎస్పీ సూచించారు. ఆయన పిఠాపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌ ఆవరణ, పరిసరాలు, రిసెప్షన్‌ కౌంటర్‌ను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించాలని సూచించారు. పిఠాపురం రూరల్‌ ఎస్‌ఐ అబ్ధుల్‌నబీ ఉన్నారు.

Updated Date - 2023-05-24T23:57:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising