అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి
ABN, First Publish Date - 2023-05-04T00:24:35+05:30
కిర్లంపూడి, మే 3: అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని.. గంజాయి, దొంగతనాలు, రౌడీయిజం వంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎస్.సతీ్‌షకుమార్ పేర్కొన్నారు. బుధవారం కిర్లంపూడిలో నూతన పోలీ్‌సస్టేషన్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 80శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే భవనం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. జిల్లాలో 20221 -22లో ప్రమాదాల నివారణచర్యలు చేపట్టడంతో
ఎస్పీ సతీ్‌షకుమార్
కిర్లంపూడి, మే 3: అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామని.. గంజాయి, దొంగతనాలు, రౌడీయిజం వంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ ఎస్.సతీ్‌షకుమార్ పేర్కొన్నారు. బుధవారం కిర్లంపూడిలో నూతన పోలీ్‌సస్టేషన్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 80శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే భవనం అందుబాటులోకి రానున్నదని తెలిపారు. జిల్లాలో 20221 -22లో ప్రమాదాల నివారణచర్యలు చేపట్టడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, 2023లో కూడా మరిన్ని చర్యలు చేపడతామన్నారు. హైవేలో క్రాస్‌రోడ్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఎస్పీ వెంట ఏఎస్పీ శ్రీనివాస్, సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్‌ఐ రఘునాఽధరావు, ఏఎస్‌ఐ రామకృష్ణ, పి.సత్యనారాయణ ఉన్నారు.
జగ్గంపేట స్టేషన్ సందర్శన
జగ్గంపేట: జగ్గంపేట పోలీ్‌సస్టేషన్‌ను ఎస్పీ సందర్శించి స్టేషన్‌లో పరిస్థితులపై సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్‌ఐ సీహెచ్ విద్యాసాగర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపాలని, రాత్రివేళల్లో గస్తీ పెంచి దొంగతనాలను నియంత్రించాలని సూచించారు. ఏఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గండేపల్లి: గండేపల్లి పోలీ్‌సస్టేషన్‌ను ఎస్పీ సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. సక్రమంగా ఉండడంతో సీఐ సూర్య అప్పారావు, ఎస్‌ఐ గణే్‌షకుమార్‌ను అభినందించారు. సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2023-05-04T00:24:35+05:30 IST