సుపరిపాలన చంద్రబాబుతోనే సాధ్యం
ABN, First Publish Date - 2023-04-29T00:57:35+05:30
జైలుపార్టీకి కాలం చెల్లిందని ప్రజలు చంద్ర బాబు పాలన గుర్తు చేసుకుంటున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నాయకు డు, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
తాళ్ళూరులో యనమల పర్యటన విజయవంతం
తునిరూరల్, ఏప్రిల్ 28: జైలుపార్టీకి కాలం చెల్లిందని ప్రజలు చంద్ర బాబు పాలన గుర్తు చేసుకుంటున్నట్లు శాసనమండలి ప్రతిపక్ష నాయకు డు, పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్‌గా మారిన వైసీపీ నాయకులను నిలదీయాలన్నారు. తాళ్ళూరులో రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో ముఖ్యఅతిఽథిగా టీడీపీ ఇన్‌చార్జ యనమల దివ్యతో కలిసి పాల్గొన్నారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యనమల సోదరులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దివ్యని ఆశీర్వదించాలని కోరిన వీరు రానున్నది రామరాజ్య మని, టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల కృష్ణుడుతో పాటు, పోల్నాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, తమరాన కృష్ణ, ఆవుగడ్డి వెంకటరమణ, నాయుడు, గోపాలకృష్ణ ఉన్నారు.
టీడీపీపై ప్రజల ఆదరాభిమానం పెరిగింది: టీడీపీ నేత మెట్ల
ప్రత్తిపాడు: తెలుగుదేశంపై ప్రజల ఆదారాభిమానం పెరిగిందని రాబోయే ఎన్నిక ల్లో టీడీపీ విజయమని టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు మెట్ల రమణ బాబు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంవద్ద శుక్రవారం నియోజకవర్గ క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు, ఐటీడీపీ సభ్యులు నియోజకవర్గ నాయకులు టీడీపీ శ్రేణులకు ఇంటిగ్రేటెడ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మెట్ల రమణబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీదే విజయమని ఇందుకు ప్రజల్లో వచ్చిన మార్పు నిదర్శనమన్నారు. అమరా వతి నుంచి వచ్చిన శివశంకర్, దత్తు స్థానిక నాయకుడు కొండపల్లిశ్రీనులు హౌస్‌ఓల్డ్ మ్యాపింగ్, టీడీపీ మ్యాపింగ్ వినియోగం, టెలిగ్రా, వాట్సాప్, ఫేస్‌బుక్ వాడకం, ఓటర్ల జాబితాలో తప్పులు గుర్తించడం నూతన ఓటర్లు చేర్చడం, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాల్లో సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్లడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కొమ్ముల కన్నబాబు, బద్ది రామారావు, అమరాది వెంకట్రావు, మూది నారాయణస్వామి, ఇఠంశెట్టి సూర్యభాస్కర బాబు, తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడిగా విచ్చేసిన మెట్ల రమణబాబుకు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ వరుపుల సత్యప్రభరాజా ఆధ్వర్యంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్ ముదునూరి మురళీకృష్ణంరాజు ఘనంగా సన్మానించారు.
Updated Date - 2023-04-29T00:57:35+05:30 IST