East Godavari: చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ అప్రమత్తం
ABN, First Publish Date - 2023-02-19T09:24:01+05:30
తూర్పుగోదారి జిల్లా: టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు (Nara Chandrababu) భద్రతపై ఎస్ఎస్‌జీ (NSG) అప్రమత్తమైంది. అనపర్తిలో చంద్రబాబుపై పోలీసుల తీరును తప్పుపట్టింది.
తూర్పుగోదారి జిల్లా: టీడీపీ (TDP) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు (Nara Chandrababu) భద్రతపై ఎస్ఎస్‌జీ (NSG) అప్రమత్తమైంది. అనపర్తిలో చంద్రబాబుపై పోలీసుల తీరును తప్పుపట్టింది. జడ్ ఫ్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ కేంద్ర కార్యాలయా
నికి లేఖ రాసింది. ఏడు కి.మీ. దూరం నడిపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోందని సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు.. అనపర్తిలో పర్యటించిన సమయంలో చోటు చేసుకున్న ఘటనలు తూర్పు గోదావరి జిల్లా పోలీసుల మెడకు చుట్టుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసు అధికారుల తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్న ఎన్‌ఎస్‌జీ బృందం తమ కేంద్ర కార్యాలయానికి లేఖ రాసినట్లు తెలిసింది. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబు రక్షణ విషయంలో స్థానిక పోలీసులు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోలేదని ఈ లేఖలో వెల్లడించినట్లు సమాచారం.
ఈ వార్త కూడా చదవండి..
ఏపీ పోలీసులలో క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోతోంది...
అనపర్తిలో చంద్రబాబు సభకు అనుమతి రద్దు చేసిన తూర్పు గోదావరి జిల్లా పోలీసులు... ఆయన అక్కడకు వెళ్లకుండా అడ్డుకోవడానికి మార్గమధ్యంలో శత విధాల ప్రయత్నించారు. ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్లకుండా వాహనాలు అడ్డుపెట్టారు. పోలీస్ కానిస్టేబుళ్లను రోడ్డుపై అడ్డుగా కూర్చోబెట్టారు. దీంతో చంద్రబాబు తన వాహనం నుంచి దిగి రాత్రివేళ నడుచుకొంటూ 7 కిలోమీటర్ల దూరంలోని అనపర్తి చేరుకున్నారు. పోలీసులు కావాలని ఆ రోడ్డులో విద్యుత్ లైట్లు కూడా ఆర్పివేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం ఘటనలపై ఎన్‌ఎస్‌జీ భద్రతా దళం అధికారి తమ కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపారని తెలిసింది.
చంద్రబాబుకు తగిన భద్రత కల్పించే విషయాన్ని స్థానిక పోలీస్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదని లేఖలో ఎన్‌ఎస్‌జీ పొందుపరిచింది. ఆయన వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా జామర్ రక్షణ ఉండాలని, అలాగే వెంట తప్పనిసరిగా అంబులెన్స్ ఉండాలని, ఇవేవీ స్థానిక పోలీసులు లేకుండా చేశారని చెప్పినట్లు సమాచారం. 7 కిలోమీటర్ల దూరం చంద్రబాబు నడుస్తూ వెళ్లినప్పుడు జామర్, అంబులెన్స్ ఏదీ లేదని, ఎవరైనా ఆయనపై రాళ్ల దాడికి పాల్పడితే అడ్డుకొనే రక్షణ వ్యవస్థను కూడా స్థానిక పోలీసులు కల్పించలేదని వివరించినట్టు తెలిసింది. ఈ నివేదిక కాపీని కేంద్ర హోం శాఖకు కూడా పంపినట్టు సమాచారం. కాగా ఎన్‌ఎస్‌జీ నివేదిక పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై సంబంధిత పోలీస్ అధికారులకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
అనపర్తిలో నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సభ నిర్వహించడంతోనే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దీంతో బస్సు అద్దాలు పగలగొట్టారని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు తెలిపారు. కొందరు రాళ్లు విసరడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. సభ నిమిత్తం రెండు స్థలాలు చూపించామని, అయినా పార్టీ నాయకులు సహకరించలేదని, రోడ్డుపైనే సభ పెట్టారని ఆరోపించారు. పైగా ర్యాలీగా వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉందన్నారు. సభ నిర్వహించడానికి అనుమతి లేదని డీఐజీ చెప్పారు.
Updated Date - 2023-02-19T09:24:22+05:30 IST