నేడు కలెక్టర్ వర్సెస్ ఎస్పీ టీమ్‌ల క్రికెట్ మ్యాచ్
ABN, First Publish Date - 2023-02-05T00:51:07+05:30
ఉద్యోగుల పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత తెలిపారు.
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పని ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత తెలిపారు. జీఎస్‌ఎల్ క్రీడామైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి కలెక్టర్ 11 వర్సెస్ ఎస్పీ 11 ట్వంటీట్వంటీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించేందుకు జీఎస్‌ఎల్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు చేశామన్నారు. పోటీలను కలెక్టర్ మాధవీలత టాస్ వేసి ప్రారంభిస్తారని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బాపిరాజు తెలిపారు.
ఫ కలెక్టర్ టీమ్ :
కలెక్టర్ మాధవీలత కెప్టెన్.. మునిసిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి కె. దినేష్‌కుమార్(బ్యాట్స్‌మెన్), జేసీ ఐఏ ఎస్ అధికారి ఎన్. తేజ్‌భరత్(బౌలర్), డిప్యూటీ తహసీల్దారు జిబాపిరాజు, వీఎస్.అజయ్ (బ్యాట్స్‌మెన్, వికెట్‌కీపర్),ఎస్‌ఏఎన్ గోపీచంద్ (బ్యాట్స్‌మెన్) ,జేఏకె ప్రసాద్(బ్యాట్స్‌మెన్),జేఏ గంగాధర్, వీఆర్‌వో కె.శ్రీను, వీఎస్ అరవింద్, వీఎస్ నవీన్ (ఆల్‌రౌండ ర్లు), వీఎస్ వేణు (బౌలర్, ఆల్‌రౌండర్), , వీఎస్ సిలార్‌ఖాన్(బ్యాట్స్‌మెన్),ఓ.ఎస్ అప్పారావు(బౌలర్) ఉన్నారు.
ఫ ఎస్పీ టీమ్ :
ఎస్పీ సిహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి కెప్టెన్, ఎస్‌ఐ టి.రవీంద్ర, ఏఆర్‌పీసీ ఏ.మోహన్, ఏఆర్‌పీసీ జి.దినేష్, సీజెడ్ పీసీ జి.ప్రసాద్(వికెట్‌కీపర్), ఏఆర్‌పీఎస్ కె.రత్నం, ట్రాఫిక్ పీసీ టి.వరహాలు, అనపర్తి పీపీ కె. సు రేష్, ఎస్బీపీసీ జె.మధు, పీసీ ఆబ్సరీబేగ్, పీసీ వి.వాసు, ట్రాఫిక్ పీసీ పి. అనిల్‌కుమార్, ఏఆర్‌పీసీ సీహెచ్ నాగబాబు, ఏఆర్‌పీసీ ఏ నారాయణ, ఏఆర్‌పీసీ ఎం అకోక్, ఆర్‌ఐ ఎం.ఎన్ మూర్తి(కోచ్) లు ఉంటారు.
Updated Date - 2023-02-05T00:51:09+05:30 IST