ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అదుపులో నకిలీ వైద్యురాలు

ABN, First Publish Date - 2023-04-21T00:28:52+05:30

కాకినాడ జీజీహెచ్‌ ప్రాంగణంలో మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని అచ్చం డాక్టర్‌లా తిరుగుతూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికి సొమ్ములు వసూలు చేస్తున్న ఓ నకిలీ వైద్యురాలిని వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీజీహెచ్‌ (కాకినాడ): ఏప్రిల్‌ 20: కాకినాడ జీజీహెచ్‌ ప్రాంగణంలో మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని అచ్చం డాక్టర్‌లా తిరుగుతూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానంటూ నమ్మబలికి సొమ్ములు వసూలు చేస్తున్న ఓ నకిలీ వైద్యురాలిని వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. సామర్లకోటకు చెందిన 24 ఏళ్ల సానా అరుణసాయి గతంలో సర్పవరంలోని ఓ నర్సింగ్‌ స్కూల్‌లో జీఎన్‌ఎం కోర్సు చదివింది. అనంతరం ఆమెకు ఎక్కడా ఉద్యోగం దొరకక పోవడంతో గత డిసెంబరు నెల నుంచి జీజీహెచ్‌లో ఉద్యోగాన్వేషణ చేసింది. కానీ ఉద్యోగం రాకపోవడంతో అరుణసాయి డాక్టర్‌గా వేషం మార్చింది. ఆప్రాన్‌ వేసుకుని మెడలో స్టెతస్కో్‌పతో ఆసుపత్రి ప్రాంగణంలో హల్‌చల్‌ చేసే క్రమంలో ఆమెకు మాధురి అనే మహిళ పరిచయమైంది. తాను డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నానని, తనకు ఆసుపత్రిలో ఏదైన ఉద్యోగం ఇప్పించాలని అరుణసాయిని అభ్యర్థించింది. ఉద్యోగానికి కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పడంతో అందుకు మాధురి అంగీకరించింది. ఈ క్రమంలో రెండు దఫాలుగా రూ. 50 వేలు అరుణసాయికి ముట్ట చెప్పింది. అదే విధంగా మరి కొంత మందిని అరుణసాయి ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించి ముఖం చాటేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం . అయితే అరుణసాయి చేతిలో మోసపోయిన మాధురి గురువారం వైద్యం నిమిత్తం జీజీహెచ్‌కు రాగా ఆమెకు తనను మోసగించిన అరుణసాయి తారసపడింది. దాంతో ఆమె అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యురిటీ గార్డు ధనలక్ష్మి సహాయంతో జీజీహెచ్‌ అవుట్‌ పోస్టు పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించింది. వారిచ్చిన సమాచారంతో వన్‌టౌన్‌ పోలీసులు అరుణసాయిని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితురాలు ఉద్యోగాలిప్పిస్తానని మరికొందరి నుంచి డబ్బు వసూలు చేసినట్లు సమాచారముందని ఆ విషయం విచారణలో బయటపడనున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు వైద్యురాలిగా హల్‌చల్‌ చేయడం ద్వారానే బాఽధితులు ఆమె బుట్టలో పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-21T00:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising