జాబ్ ఎక్కడ జగన్ అంటూ నిరుద్యోగుల నిరసన
ABN, First Publish Date - 2023-01-10T01:23:35+05:30
రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్‌లో సోమవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులు తమకు జాబ్ ఎక్కడ సీఎం జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుయువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం
తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ
హాజరైన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 9: రాజమహేంద్రవరం దేవీచౌక్ సెంటర్‌లో సోమవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులు తమకు జాబ్ ఎక్కడ సీఎం జగన్ అంటూ ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుయువత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భవాని మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యో గాలు ఇస్తానని చెప్పి మాట తప్పాడన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ అమలుచేసిన నిరుద్యోగ భృతిని రద్దు చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో పాలన సాగుతోందని, దానిని అంతమొందించాలన్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల పింఛన్లు, 15 లక్షల రేషన్ కార్డులు తొలగించి పేదల కడుపుకొట్టాడని మండిపడ్డారు. చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కుడుపూడి సత్తిబాబు, తీడా నరసింహరావు, మజ్జి రాంబాబు, మర్రి దుర్గా శ్రీనివాస్, బుడ్డిగ గోపాలకృష్ణ, యాళ్ళ ప్రదీఫ్, మహబూబ్ ఖాన్, బుడ్డిగ రవి, అట్టాడ రవి, సప్పా వెంకట రమణ, బొర్రా చిన్ని, ద్వారా పార్వతి సుందరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-10T01:23:38+05:30 IST