ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: ఇదేం భద్రత? కర్రలతో కాపలానా!?

ABN, First Publish Date - 2023-09-12T02:46:59+05:30

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు... రాష్ట్రంలోని అతిపెద్ద కారాగారాల్లో ఇదొకటి! 1800 మందికిపైగా ఖైదీలు! అందులో కరుడుగట్టిన నేరస్థులూ ఉన్నారు! ఇప్పుడు అక్కడే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఉన్నారు. సెంట్రల్‌ జైలులో

రాజమహేంద్రవరం జైలులో ఇదీ ‘భద్రత’

చంద్రబాబుకు ఎన్‌ఎ్‌సజీ కమెండోల రక్షణ

నేడు కరడుగట్టిన నేరస్థుల నడుమ మాజీ సీఎం

10-15 మంది జైలు సిబ్బందితో లాఠీలతో భద్రత

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు... రాష్ట్రంలోని అతిపెద్ద కారాగారాల్లో ఇదొకటి! 1800 మందికిపైగా ఖైదీలు! అందులో కరుడుగట్టిన నేరస్థులూ ఉన్నారు! ఇప్పుడు అక్కడే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఉన్నారు. సెంట్రల్‌ జైలులో ఆయనకు కల్పించిన భద్రత ఎలా ఉందో తెలుసా? కర్రలు పట్టుకున్న కొంతమంది జైలు సిబ్బంది ఆయనకు ‘పకడ్బందీగా’ భద్రత కల్పిస్తున్నారు!

ఇదీ పరిస్థితి...

జగన్‌ సర్కారు వచ్చాక చివరికి జైళ్లను నిర్వహించడానికీ డబ్బుల్లేక పలు జైళ్లను మూసేశారు. ఆ ఖైదీలందరినీ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకే తరలించారు. ప్రస్తుతం ఇక్కడ రిమాండు ఖైదీలతో కలిపి సుమారు 1800 మంది ఉన్నారు. జైలులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కేవలం 400 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా విధుల్లో ఉంటారు. జైలు సిబ్బందిపై ఖైదీలు తిరగబడిన సందర్భాలూ ఉన్నాయి. జైలులోని సిబ్బంది వద్ద ఆయుధాలు ఉండవు. చేతిలో కర్ర మాత్రమే ఉంటుంది. ఎప్పుడూ ఎన్‌ఎ్‌సజీ కమెండోల భద్రతలో ఉండే చంద్రబాబుకు ఇప్పుడు... రాజమహేంద్రవరం జైలులో షిఫ్టుల వారీగా చేతిలో కర్రలతో 10-15 మందిని కాపలాగా ఉంచుతున్నారు. ఆయనకు కేటాయించిన స్నేహబ్లాకు జైలులోని రెండో ప్రధాన గేటు నుంచి సుమారు 50 మీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ప్రహరీ ఉన్నా పూర్తి రక్షణ అని చెప్పలేం. బయటి నుంచి జైలులోకి గంజాయి, సిగరెట్లు, బీడీ కట్టలు విసిరిన సందర్భాలు ఉన్నాయి. జైలు లోపల బీరువాల తయారీ వంటి పరిశ్రమలు కూడా ఉంటాయి. వీటిలో పనిముట్లను ఆయుధాలుగా ఉపయోగించే వీలు ఉంటుంది. స్నేహా బ్లాక్‌ పెద్ద రెండంతస్తుల భవనం. దీనిలో దాదాపు 30 పెద్ద గదులు ఉంటాయి.

భద్రతపై భయం ఇదే

అలిపిరి ఘటన తర్వాత కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు ఎన్‌ఎ్‌సజీ కమెండోలతో జడ్‌ ప్లస్‌ భద్రత కల్పించింది. అయినప్పటికీ... ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆయన రక్షణపై ఎన్‌ఎ్‌సజీ స్వయంగా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం చంద్రబాబుకు భద్రతను రెట్టింపు చేసింది. 6+6 (12) కమెండోలతో ఉన్న భద్రతను 12+12(24)కు పెంచుతూ 2022 ఆగస్టు 26న ఉత్తర్వులిచ్చింది. అటు... జగన్‌ సర్కారేమో చంద్రబాబుకు రక్షణగా ఉన్న రాష్ట్ర పోలీసులను తగ్గించేసింది. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గింది.

వరుస దాడులు...

  • కుప్పంలో చంద్రబాబుపై జరిగిన దాడిలో ఎన్‌ఎ్‌సజీ కమాండో కూడా గాయపడ్డారు.

  • గతంలో చంద్రబాబు అమరావతికి బస్సులో వెళ్తుండగా రాళ్ల దాడి జరిగింది.

  • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.

  • తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పర్యటనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు రాత్రివేళ 7 కిలోమీటర్లు నడిచారు. ఆ దారిలో పోలీసులు కావాలనే లైట్లు ఆర్పివేసినట్టు ఎన్‌ఎ్‌సజీ అనుమానించింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన జామర్‌, అంబులెన్సులు కూడా లేవని కేంద్రానికి నివేదిక పంపింది.

Updated Date - 2023-09-12T10:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising