ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తలుపులమ్మ లోవ కిటకిట

ABN, First Publish Date - 2023-05-15T00:24:10+05:30

తూర్పు కనుమల్లో కొలువుదీరిన తలుపులమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించేందుకు లోవ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని రూరల్‌, మే 14: తూర్పు కనుమల్లో కొలువుదీరిన తలుపులమ్మ తల్లికి మొక్కుబడులు చెల్లించేందుకు లోవ క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవులు, దీనికి తోడు టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల అవ్వడంతో తల్లికి మొక్కుబడులు చెల్లించేందుకు కుటుంబ సమేతంగా వందలాది కుటుంబాలు వేకువ జామునే లోవకు చేరుకున్నాయి. కిలోమీటర్ల మేర భక్తజన సందోహంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ప్రత్యేక క్యూలైన్‌లలో భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల అవసరాలకు అనుగుణంగా వసతి గదులు అందుబాటులో లేకపోవడంతో దేవస్థానం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులు, ఆరుబయట మామిడి తోటలు భక్తులకు వసతి కల్పించాయి. తోటల్లో వంటవార్పు చేసుకున్న భక్తులు సహపంక్తి భోజనాలు చేశారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చలువ పందిళ్ళు, చలివేంద్రాలు ఏర్పాటుతో పాటు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆలయానికి భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.3,95,822 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు.

Updated Date - 2023-05-15T00:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising