Yanamala: ఓటమి భయంతోనే ‘యువగళం’ పాదయాత్రకు ఆంక్షలు..
ABN, First Publish Date - 2023-01-25T12:33:35+05:30
ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ఆంక్షలు, ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి: ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం (Jagan Govt.) నారా లోకేష్ (Nara Lokesh చేపట్టిన ‘యువగళం (Yuvagalam)’ పాదయాత్ర (Padayatra)కు ఆంక్షలు, ఆటంకాలు సృష్టిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర ప్రభంజనంతో జగన్ రెడ్డి అవినీతి కోటలు బద్దలవడం ఖాయమన్నారు. బందోబస్తు కల్పించాల్సిన పోలీసులు పాదయాత్రకు ఆంక్షలు విధించడమేంటని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు లోకేష్ పాదయాత్ర కోసం ఎదురుచూస్తున్నారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
Updated Date - 2023-01-25T12:33:38+05:30 IST