టోల్ బాదుడు
ABN, First Publish Date - 2023-04-02T01:00:27+05:30
లేదు..లేదంటూనే టోల్ చార్జీలు అమాంతం పెంచే శారు. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 10 నుంచి రూ. 50 పెంపు.. వాహనదారుల ఆగ్రహం
నల్లజర్ల,ఏప్రిల్ 1 : లేదు..లేదంటూనే టోల్ చార్జీలు అమాంతం పెంచే శారు. దీంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అనంతపల్లి- వీరవల్లి, కొవ్వూరు టోల్ ప్లాజాలు ఉన్నాయి. టోల్ ప్లాజాల వద్ద శుక్రవారం అర్దరాత్రి నుంచి వాహనాలపై వడ్డింపు ప్రారంభించారు. పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి తెచ్చారు.నల్లజర్ల మండలం అనంతపల్లి-వీరవల్లి టోల్ ప్లాజా వద్ద నూతన ధరల పట్టికను ఏర్పాటు చేశారు.గూడ్స్ వాహనాలకు,లారీలకు రూ.50 వరకు పెంచారు.గతంలో గూడ్స్ వాహనాలు,వస్తువుల రవాణా లారీలకు రూ.950 ఉండగా నూతన ధరలు రూ.1000 చేశారు.కారు సింగిల్‌కి గతంలో రూ.145 ఉంటే ప్రస్తుతం రూ.155లకు పెరిగింది.గూడ్స్,వస్తు రవాణా వాహనాలపై టోల్ పెంచడం వల్ల కూరగాయలు,నిత్యావసర వస్తువుల ధరలు,ఇసుము,సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. టోల్‌ప్లాజా నుంచి రోజుకి (24గంటలు) 14 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.గతంలో రోజుకి రూ.40 లక్షలు టోల్ వసూళ్లు కాగా నూతన ధరల ప్రకారం మరో రూ.5 లక్షలు అదనంగా వసూలవుతుందని టోల్ సిబ్బంది చెబుతున్నారు. వాహనదారులు మాత్రం పెరిగిన ధరలపై మండిప డుతు న్నారు. ప్రభుత్వం వడ్డించడం తప్ప తగ్గించడం ఏమీలేదని వాపోతున్నారు.
=
Updated Date - 2023-04-02T01:00:27+05:30 IST