ఉమ్మడి మేనిఫెస్టోతో మేలు
ABN, Publish Date - Dec 19 , 2023 | 12:05 AM
తుని రూరల్, డిసెంబరు 18: టీడీపీ, జనసేన రూపొందిస్తున్న ఉమ్మడి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. తుని 16వ వార్డులో సోమవారం ఇంటింటా ప్రచారం చేపట్టిన ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, జగ
తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య
తుని రూరల్, డిసెంబరు 18: టీడీపీ, జనసేన రూపొందిస్తున్న ఉమ్మడి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య అన్నారు. తుని 16వ వార్డులో సోమవారం ఇంటింటా ప్రచారం చేపట్టిన ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని, జగన్ పాలనతో అవినీతి విధ్వంసం రాజ్యమేలుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. ఆమె వెంట టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, జిల్లా టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, టీడీపీ సీనియన్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్, మళ్ళ గణేష్‌కుమార్, కుక్కడపు బాలాజీ, దొంతులూరి శ్రీనివాసరాజు ఉన్నారు.
Updated Date - Dec 19 , 2023 | 12:05 AM