ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ABN, First Publish Date - 2023-06-13T01:23:05+05:30

నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న కేటుగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి), జూన్‌ 12: నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్న కేటుగాళ్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి సూచించారు. మధ్యవర్తుల ముసుగులో కొంతమంది నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి మోసగిస్తున్నారన్నారు. ఇలాంటి పలు కేసులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు రాతపరీక్ష, ఇంటర్వ్యూ వంటి పక్రియ లేకుండా వచ్చే అవకాశం ఉండదన్నారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు ఏదైనా సందేహముంటే సంబంధిత ప్రభుత్వశాఖను లేదా సంస్థను సంప్రదించా లని సూచించారు. మోసగాళ్ల ఆటకట్టించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. ఉద్యోగాల కోసం డబ్బులు ఇవ్వడం కూడా నేరమని గుర్తుంచుకోవాలన్నారు. ఈ విషయంలో ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాగా.. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు 36 ఫిర్యాదులు అందాయి.

Updated Date - 2023-06-13T01:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising