Tirupathi: వివేకా హత్య కేసుపై యనమల సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-25T13:33:45+05:30
తిరుపతి: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు (Yanamala Ramakrishnudu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Murder Case)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు (Yanamala Ramakrishnudu) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వివేక మృతిపై సీబీఐ (CBI)కి సహకరించడం లేదని, తెలుగుదేశంకు (TDP).. గూగుల్ టెక్ (Google Tech)కు ఏం సంబంధమని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక.. జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) హస్తం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కరప్ట్ (Corrupt) చేసి.. అవినీతి పరిపాలన చేస్తున్నప్పుడు సీఎం జగన్‌కు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలో ఐపీసీ (IPC) అమలు కావడంలేదని, జేపీసీ (JPC) (జగన్ పీనల్ కోడ్) అమలవుతోందన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ పోయి జగన్ పీనల్ కోడ్ వచ్చిందన్నారు. పోలీసులు కూడా జేపీసీనే ఫాలో అవుతున్నారన్నారు.
రాష్ట్రంలో ఎవరు పాదయాత్ర (Padaytra) చేయడానికి అవకాశం లేదా..? అని యనమల ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో..అందరి హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షం ప్రజల సమస్యలను ప్రశ్నిస్తోందని, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చెయ్యడానికేనని, ప్రతిపక్షాలను అణిచివేయడానికి కాదని అన్నారు. తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రూ. లక్ష కోట్లు అవినీతి చేసారని అన్నారు. అక్రమ ఆర్జనతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారుని విమర్శించారు.
రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్రాలు చేసుకోవచ్చునని, ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే... అనవసరంగా అడ్డుకుంటున్నారని యనమల మండిపడ్డారు. ప్రతిపక్షాలను, మీడియాను అణిచివేయాలని చూస్తున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ప్రశ్నించారు. ఉన్న పరిశ్రమలు వెళిపోతున్నాయని, ఎవరైనా పరిశ్రమలు పెట్టాలని వస్తే కమిషన్ అడుగుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ట్రెజరీలో డబ్బులు లేవని.. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవదని, వచ్చేది టీడీపీయేనని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు.
రోడ్డులో గుంతలు పూడ్చే పరిస్థితి లేదని, రాష్ట్రంలోని అప్పులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని యనమల డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రూ. 11 లక్షల కోట్ల అప్పు చేశారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకున్నారని, పాదయాత్రలో వచ్చే సమస్యలను అధ్యయనం చేసి టీడీపీ మేనిఫెస్టోలో పెడాతామన్నారు. జగన్ పాలసీ దొంగ ఓట్లు వేసుకోవడం.. అధికారంలో ఉన్నప్పుడు దొంగ నోట్లు ముద్రించడమేనని వ్యాఖ్యానించారు. జేపీసీ అమలు చేయడంలో జగన్.. తన తాత రాజారెడ్డి (Raja Reddy)ని మించిపోయారని యనమల రామకృష్ణుడు అన్నారు.
Updated Date - 2023-02-25T13:33:48+05:30 IST