‘వైసీపీ ప్రభుత్వాన్ని చీ కొడుతున్న రాష్ట్ర ప్రజలు’

ABN, First Publish Date - 2023-03-25T01:24:31+05:30

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీ కొడుతు న్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.

‘వైసీపీ ప్రభుత్వాన్ని చీ కొడుతున్న రాష్ట్ర  ప్రజలు’
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మలికిపురం, మార్చి 24: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు చీ కొడుతు న్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. శుక్రవారం చింతల మోరిలో గ్రామశాఖ అధ్యక్షుడు చవ్వాకుల వెంకటరత్నం అధ్యక్షతన జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పట్టబద్రుల శాసనమండలి ఎన్నికల్లో విద్యావంతులు టీడీపీ అభ్యర్థులను గెలిపించడం చూస్తుంటే రాష్ట్రంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయని, చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. చింతల మోరిలో పరిశీలకుడు చిటికెన రామ్మోహనరావుతో కలసి వందలాది కుటుం బాలను సందర్శించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కార్యక్రమంలో మంగెన భూదేవి, దొడ్డా భుజంగరావు, మైనం వెంకటస్వామి, కొల్లు పెద్దిరాజు, దొడ్డా ఏడుకొండలు, అడబాల యుగంధర్‌, రాపాక నవరత్నం, ముప్పర్తి నాని, యెనుముల నాగు, చాగంటి స్వామి, బందెల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T01:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising