ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gangireddy: సీబీఐ ముందుకు ఎర్ర గంగిరెడ్డి

ABN, First Publish Date - 2023-02-05T03:10:28+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డికి సీబీఐ అధికారులు సమన్లు అందజేశారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10న కోర్టుకు రావాలంటూ సమన్లు అందజేత

9న కడప జైల్లో ఉన్న నిందితులు హైదరాబాద్‌కు?

కేసు బదిలీ అయిన తరువాత తొలిసారి విచారణకు

కడప, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డికి సీబీఐ అధికారులు సమన్లు అందజేశారు. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. గతనెల 27న సీబీఐ కోర్టు కేసు నం.ఎ్‌ససీ-01-2023ని కేటాయించింది. ఈ మేరకు హత్య కేసులో నిందితులైన ఎర్రగంగిరెడ్డి, డ్రైవరు దస్తగిరి (అప్రూవర్‌), సునీల్‌యాదవ్‌, ఉమాశంకరరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలకు సమన్లు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు నిందితులు హైదరాబాద్‌లో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి బెయిలుపై ఉండగా సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డి సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్నారు. ఈ నేపథ్యంలో శనివారం కడప సెంట్రల్‌ జైలుకు వచ్చి ఎర్రగంగిరెడ్డి సమన్లు తీసుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడకుండా ఆటోలో వెళ్లిపోయారు. ఆదివారం దస్తగిరి కూడా సమన్లు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక జైలులో రిమాండులో ఉన్న ముగ్గురు నిందితులకు సమన్లు ఆందించే విషయమై జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటే జైలులో ఉన్న నిందితులను 9న హైద రాబాద్‌కు తీసుకురావాల్సిందే. ఈ మేరకు భద్రత కోసం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.

కే సు బదిలీ అయిన తరువాత తొలిసారిగా నిందితులు అక్కడి కోర్టుకు హాజరు కానున్నారు. తరచూ కోర్టు విచారణకు కడప నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లాలంటే భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయి. మరి రిమాండులో ఉన్నవారిని అక్కడికి షిఫ్ట్‌ చేస్తారా, లేక కడప సెంట్రల్‌ జైలులోనే ఉంచుతారా అన్న చర్చ నడుస్తోంది. కాగా, వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే ఎంపీ అవినాశ్‌రెడ్డిని విచారించగా రెండురోజుల క్రితం సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి పీఏ నవీన్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఎంపీ అవినాశ్‌ కాల్‌ డేటా, విచారణలో ఆయన వెల్లడించిన వివరాల మేరకు ఇంకా పలువురికి నోటీసులు అందే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ అధికారులు కడపలోనే మకాం వేశారు. 10న కోర్టు విచారణ ఉండటంతో ఆలోపుగా కొందరికి నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-05T03:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising