ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతుల పంట దెబ్బతిన్నా.. సీఎం ప్యాలెస్‌ వీడరా..!: యనమల

ABN, First Publish Date - 2023-12-07T04:46:28+05:30

మిచౌంగ్‌ తుఫానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం జగన్‌రెడ్డి విఫలం కావడం వల్లే లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

రైతు కన్నీళ్లను ముఖ్యమంత్రే తుడవాలి: మర్రెడ్డి

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): మిచౌంగ్‌ తుఫానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం జగన్‌రెడ్డి విఫలం కావడం వల్లే లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రైతులు నష్టపోయారని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు. ‘‘విలువైన పంటలు దెబ్బతిన్నా.. సీఎం తాడేపల్లి ప్యాలెస్‌ వదలడం లేదు. తుఫాన్‌ పునరావాస శిబిరాల్లో కనీసం మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం రైతులు రూ.7 వేల కోట్ల పంట నష్టపోయారు. ధాన్యం, ఇతర ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పాలిన్‌ పట్టలు ఇవ్వకుండా, రైతు కష్టాన్ని వర్షార్పణం చేశారని యనమల మండిపడ్డారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తుఫాన్‌ వల్ల రైతులకు జరిగిన నష్టానికి, ప్రజలు కష్టాలు పడటానికి జగన్మోహన్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ‘‘వర్షాలకు పంట నష్టపోయిన రైతుల కన్నీళ్లను ముఖ్యమంత్రే తుడవాలి. తుఫాన్‌కు దెబ్బతిన్న వరి, చెరకుకుహెక్టారుకు రూ.30 వేలు, అరటికి రూ.40 వేలు, మిర్చి, ఆక్వాకు రూ.50 వేలు, పత్తికి రూ.25 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి. తుఫాన్‌ వల్ల చనిపోయిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. నిబంధనలు పక్కన పెట్టి, ధాన్యం పూర్తిగా కొనాలి. సర్వం కోల్పోయిన వారిని మానవతా దృక్పథంతో ఆదుకోకుంటే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మర్రెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2023-12-07T06:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising