ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘ప్రకాశం’లో ఘోర ప్రమాదం

ABN, Publish Date - Dec 23 , 2023 | 04:07 AM

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు సమీపంలో అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది.

ఆరుగురు దుర్మరణం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టిన కారు

మార్కాపురం రూరల్‌ డిసెంబరు 22: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు సమీపంలో అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకా రం.. గుంటూరుకు చెందిన రాయ నాగేశ్వరరావు, రాయ వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా, కొమరోలులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. వీరు తిరిగి గుంటూరుకు కారులో బయలుదేరారు. నాగేశ్వరరావు కారు నడుపుతున్నాడు. కారు దేవరాజుగట్టు వద్దకు రాగానే అదుపుతప్పింది. అతివేగంతోపాటు నిర్లక్ష్యంగా కారు నడిపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అదే సమయంలో కుంట నుంచి మార్కాపురం వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో దూరంగా ఎగిరి బోల్తాపడింది. దీంతో ఘటన స్థలంలోనే కారులో ఉన్న రాయ వెంకటేశ్వరరావు, కారు నడుపుతున్న నాగేశ్వరరావు మృతిచెందారు. ఇక ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో మార్కాపురం పట్టణం పీఎస్‌ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్‌ షేక్‌ హబీద్‌ హుస్సేన్‌ (బాబు) (46), త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామానికి చెందిన ఎనిబెర అభినయ్‌(12)కూడా ఘటన స్థలంలోనే మృతిచెందారు. పెద్దదోర్నాల మండ లం గంటవానిపల్లెకు చెందిన ఉప్పలపాటి దానియేలు(45), దూపాడుకు చెందిన ఎనిబెర రత్నతేజ(9) గుంటూరుకు మెరుగైన వైద్యం కోసం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఎన్‌ఎ్‌స.వ్యవసాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు షేక్‌ ముషీదా, నెల్లూరి మైధిలీ, కే.కమెరెన్‌ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, పెద్దారవీడు ఎస్సై రాజ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Dec 23 , 2023 | 04:07 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising