Adinarayana Reddy: ఆ విషయం నేను ఎప్పుడో చెప్పా... పవన్‌కు ఇప్పుడు తెలిసింది
ABN, First Publish Date - 2023-06-19T15:52:35+05:30
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తనకు ప్రాణహానీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఈ విషయంపై మాట్లాడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ‘‘నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను... పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందనే అంశాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు’’ అని అన్నారు.
న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఇటీవల తనకు ప్రాణహానీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన ప్రముఖ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఈ విషయంపై మాట్లాడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి (Former Minister Adinarayana Reddy) మీడియాతో మాట్లాడుతూ... ‘‘నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను... పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందనే అంశాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు’’ అని అన్నారు. జగన్ (AP CM YS Jaganmohan Reddy) పాలన ఏర్పాటే విధ్వంసక రచన అని.. ఎవరు అడ్డొచ్చిన వారిని అయిపోచేసే రకమే వైఎస్ కుటుంబం అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎదిగితే తట్టుకుంటారా?.. అందులో బీజేపీతో అంటే ఇంకా అంతే అని అన్నారు. సూపరి బ్యాచ్, గంగిరెడ్డి, పులివెందుల బ్యాచ్ ఎవరు వస్తారనేది తెలియదన్నారు. వారికి హత్య చేయడం కోడిని కోసిన అంత సులభమని... అంత ఈజీగా మర్డర్ చేస్తారంటూ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఏమైనా చేస్తారని... వాళ్లకు డబ్బు కూడా కావాలి అంతే అని అన్నారు. కోట్లు సంపదించిన ఆశ తీరదన్నారు. జగన్ అల్లుళ్లను కర్ణాటక, తమిళనాడుకు సీఎంలను చేసినా ఆయనకు ఆశ తీరదని మాజీ మంత్రి యెద్దేవా చేశారు.
జగన్ నిత్య అసంతృప్త వాదన్నారు. రాష్ట్రానికి ఇలాంటి దరిద్రుడు అవసరమా అని ప్రశ్నించారు. జగన్‌కు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ముందే తెలుసన్నారు. పవన్ భద్రత విషయంలో బీజేపీ, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం ఉందని.. ఆయనకు వై కేటగిరీతో భద్రత కల్పించాలని అన్నారు. అమిత్ షా, నడ్డాలు ఏపీలో మోడీ పాలన ఎలా ఉందనే దానిపై సంకేతాలు ఇచ్చారని తెలిపారు. ఏపీలో ఇళ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్స్ వేసుకుందని విమర్శించారు. లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారన్నారు. ఏపీలో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సాఫ్ట్‌వేర్‌లో నడ్డా చెపితే, అమిత్ షా హార్డ్ వేర్‌లో చెప్పారన్నారు. అమిత్ షా మాట్లాడిన తీరుకు వైసీపీ భయపడిందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-06-19T15:52:35+05:30 IST