ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డోర్ నంబర్ లేని ఇళ్లు 13401

ABN, First Publish Date - 2023-07-26T13:00:53+05:30

నేతల తలరాతను మార్చేది. అధికారం కట్టపెట్టేది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటుకు అధికారులు విలువ లేకుండా చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిత్ర విచిత్రంగా ఓట్లను నమోదు చేశారు.....

ప్రతీ బూత్‌లో వందల్లో ఓట్లు

ఇంటి నెంబర్లు లేకుండానే నమోదు

విచిత్ర గుర్తుల్లో నమోదైన ఓట్లపై సందేహాలు

జాబితాల సవరణలో అవకతవకలు సరిదిద్దేనా?

నేతల తలరాతను మార్చేది. అధికారం కట్టపెట్టేది. ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటుకు అధికారులు విలువ లేకుండా చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చిత్ర విచిత్రంగా ఓట్లను నమోదు చేశారు. ఓటు అక్రమాలపై పెద్దఎత్తున రేగుతున్న దుమారమే ఇందుకు నిదర్శనం. ఇంటి నెంబర్లు లేకుండా, ఒకే డోర్‌ నెంబర్లలో వందల సంఖ్యలో ఓట్లు వెలుగుచూస్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ఓటర్ల జాబితాలు రూపుదిద్దుకున్నాయని, ఇందుకు అధికార పార్టీకి అధికారులు సహకరించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలను గుర్తించిన ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇప్పటి వెలుగుచూసిన, తాజా పరిశీలనలో వెలుగుచూస్తున్న అక్రమాలకు కారకులను గుర్తించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. వైసీపీ నాయకుల ప్రోత్సాహం, ఆదేశాలతోనే ఎన్నికల సిబ్బంది ఇష్టం వచ్చినట్లుగా దొంగ ఓట్లను చేర్చారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

పోలింగ్‌ బూత్‌ల వారీగా దొంగ ఓట్లు చేర్పించేందుకు వైసీపీ నాయ కులు పెద్ద ఎత్తున బరితె గించారు. గతంలో, తాజాగా మూడు రోజులుగా జరుగుతు న్న ఓటర్ల జాబితాల పరిశీలన లో వెలుగు చూస్తున్నాయి. ఓటు అక్రమాలే వారి బరితెగింపులకు నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వలంటీర్లు, అధికారుల సహకారం తో ఇష్టం వచ్చినట్లుగా ఓట్లను చేర్చారు. దొంగ ఓట్ల ద్వారా 2024లో జరిగే ఎన్నికల్లో గెలుపొం దేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఓట్లన్నీ కూడా ప్రధానంగా టీడీపీ బలంగా ఉన్న బూత్‌ల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. అదేవిధంగా వైసీపీ అనుకూల ప్రాంతాల్లోని మృతు లు, డబుల్‌ ఎంట్రీ ఓట్ల తొలగింపుల పై కూడా అధికారులు పట్టీపట్టనట్లుగా ఉన్నారు.


(ఆంధ్యజ్యోతి- బాపట్ల/నరసరావుపేట, గుంటూరు(కార్పొరేషన్‌) పోలింగ్‌ బూత్‌ల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే ఎవరైనా విస్తు పోవాల్సిందే. జాబితాలు తప్పుల తడకగా ఉన్నట్లు అటు ఓటర్లు, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు గుర్తించారు. దొంగ ఓట్లను ఎక్కిం చడం కాదు, ఏకంగా జీరో డోరు నెంబర్లతో వందల పేర్లను చేర్చారు. ఈ ఓట్ల అక్రమాల వెనుక ఎవరున్నారనేది అధికారులే తేల్చాలి. డోరు నెంబరు లేకుండా ఓటరుగా నమోదు చేయ కూడదనేది ఎన్నికల సంఘం నిబంధన. కాని అధికారులు దాని గురించే పట్టించుకోలేదు. వేలల్లో ఇలా జీరో డోర్‌ నెంబర్లతో ఓట్లను చేర్చా రు. వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు ఇలా ఓట్లను ఇష్టం వచ్చినట్లుగా చేర్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయి. ఈ క్రమంలో పలు వింతలు వెలుగు చూశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో ఇంటి నెంబర్‌ జీరోతో దొంగ ఓట్లు ఉన్నట్లు వెలుగుచూసింది. ఇంటి నెంబర్‌ ‘0’, ‘0’ గుర్తులతో పాటు, రెండు సున్నాలు, మూడు సున్నాలు, నాలుగు సున్నాలు, జీరో - (డ్యాష్‌), జీరో 5 ఇలా విచిత్రంగా డోర్‌ నెం బర్లు వేసి వాటిల్లో పెద్దసంఖ్యలో ఓట్లను చేర్పిం చారు. జీరో డోర్‌ నెంబర్‌ ఇళ్లు అత్యధికంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో 2409, అత్యల్పం గా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 44 ఉన్నట్లు తేలింది. ఉమ్మడి గుంటూరు జిల్లా లో డోర్‌ నెంబర్లు లేకుండా ఉన్న 13,401 ఇళ్లల్లో పెద్దసంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి ఇంట్లో సుమారు 70 నుంచి 80 ఓట్లను చేర్పించినట్లు టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితాలోని అవకతవక లపై టీడీపీ నాయకులు ఎక్క డికక్కడ అధికారులకు ఫిర్యా దులు చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఈ క్రమంలో ఎన్నికల కమి షన్‌ ఓటర్ల జాబితాల పరిశీలనకు ప్రత్యే కంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కదిలిన అధి కారులు ఇంటింట ఓటర్ల జాబితాలను ప్రతిపక్ష పార్టీల ప్రతినిధు ల సమక్షంలో చేస్తున్నారు. ఇప్పటికే వె లుగుచూసిన వింతలకు తోడు, తాజా పరిశీలనలో మరిన్ని విచిత్రాలు వెలు గుచూస్తున్నాయి. గతంలో ఒకే డోర్‌ నెంబర్‌లో వందల్లో ఓట్లను గుర్తించారు.

మూడు రోజులుగా జరుగుతున్న తాజా పరిశీలనలో ఇంటి నెంబర్లు లేకుండానే విచిత్రమైన గుర్తులతో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే గతంలోనే ఓటర్ల జాబితాల్లో పలు సందర్భాల్లో వెలుగుచూసిన అవక తవకలను సరిదిద్ధే ప్రయత్నం అధికారులు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం వెలుగుచూస్తున్న అవకతవకలను ఏ మాత్రం అధికారులు సరి చేస్తారనే అంశంపై ప్రజలు అను మానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పి సరిపుచ్చు తారేమోనని అభిప్రాయపడుతున్నారు. వెలుగుచూస్తున్న అవకతవకలను చూసిన వారు ఓటర్ల జాబి తాలు పారదర్శకంగా రూపొందించే పరిస్థితు లు లేవన్న అభిప్రాయం ఓటర్ల నుంచి వ్యక్త మవుతున్నది. జీరో డోరు నెంబరులో ఓటర్లు గా నమోదు చేయకూడదని అధికారులు చెప్తు న్నారు. అయితే ఈ జాబితా తయారీలో ఎవరి ప్రమేయం ఉందనేది అధికారులు తేల్చాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. డోర్‌ నెం బర్లు లేకుండా ఉన్న ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు అని ఇలాంటివి వేలల్లో ఉన్నాయని పలు వురు ఆరోపిస్తున్నారు.


ఓట్ల నమోదులో ఎన్నెన్నో అక్రమాలు

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఓటర్ల జాబితాలో నమోదైన ఓట్లను చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుసు కోవచ్చు. నరసరావుపేట మున్సిపాల్టీ పరిధిలో కొన్ని వార్డుల్లో ఒకే డోర్‌ నెంబర్‌లో వందల్లో ఓట్లు నమోదై ఉన్నాయి. నరసరావుపేట మున్సిపాల్టీ పరిధిలోని డోర్‌ నెంబర్‌ 1-1లో 243, 2-15-57/3లో 148 ఓట్లు, 12-13-6లో 80 ఓట్లు, 2లో 80, 1-1-1లో 68, 1లో 62 ఓట్లు నమోదు చేశారు. మరో 17 డోర్‌ నెంబర్లలో 30 నుంచి 58 ఓట్లు చొప్పున నమోదయ్యాయి. సత్తెనపల్లిలో 5-10-14 డోరు నెంబరులో 42వ పోలింగ్‌ బూత్‌లో ఎక్కువగా ఓట్లు నమోదై ఉన్నాయి. పోలింగ్‌ బూత్‌ నెంబరు 69లో మల్లెల లక్ష్మణ, తండ్రి మహేశ్వరరావు, మున్నూరు మేరీ తండ్రి అంకమరావు ఇంటి నెంబరు జీరోగా చూపించి ఓటర్ల జాబితాలో చేర్చారు. పోలింగ్‌ బూత్‌ 270లో 00 ఇంటి నెంబరులో 43, 133 బూత్‌లో 00 ఇంటి నెంబరులో 27, బూత్‌ 129లో 00 ఇంటి నెంబరులో 20 ఓట్లు, బూత్‌ 132లో 00 ఇంటి నెంబరులో 18 ఓట్లు, 127లో 00 ఇంటి నెంబరులో 17 ఓట్లు, 128లో 00 ఇంటి నెంబరులో 17 ఓట్లు, 175లో 00 ఇంటి నెంబరులో 17 ఓట్లు, 158లో 00 ఇంటి నెంబరులో 14 ఓట్లు, 145లో 00 ఇంటి నెంబరులో 13 ఓట్లు, 165లో 00 ఇంటి నెంబరులో 13 ఓట్లు, 178లో 00 ఇంటి నెంబ రులో 12 ఓట్లు, 228లో 00 ఇంటి నెంబరులో 11 ఓట్లు ఉన్నా యి. మాచర్ల నియోజకవర్గంలో 299 పోలింగ్‌ బూత్‌లు ఉండగా ఇప్పటి వరకు డోర్‌ నెంబర్లు లేని ఇళ్లలో 640 ఓట్లను ప్రతిపక్ష టీడీపీ పార్టీ గుర్తించింది. 293వ పోలింగ్‌ బూత్‌లో 1 - (డ్యాష్‌) 00 మీద అత్యధికంగా 42 ఓట్లను గు ర్తించారు. కనీసంగా ఏడు ఓట్ల చొప్పున నమోదు చేశా రు. దాచేపల్లి నగర పంచాయతీలోని 3, 4 వార్డుల్లో ముస్లిం మహిళలకు సంబంధించి 00 డోర్‌ నెంబరుతో ఓటు నమోదై ఉన్నాయి. చనిపోయిన వారు, గ్రామం విడిచి వెళ్లినవారు, ఊరు, పేరు తెలియని వ్యక్తులు ఫొటో లతో కూడిన పేర్లతో ఓటర్ల జాబితాలను రూపొందిం చా రు. 2, 3, 11, 14, 15 వార్డుల్లో 00 డోర్‌ నెంబరుతో ఓట్లు నమోదై ఉన్నాయి. దాచేపల్లి నగర పంచాయతీలోనే వెయ్యి ఓట్లకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపణ.

బాపట్ల జిల్లాకు సంబంధించిన ఓట్ల జాబితాల్లో 5,700 ఇళ్లకు జీరో డోర్‌ నంబరు ఉంది. అత్యధికంగా పర్చూరులో 2,202 జీరో డోర్‌ నంబరు ఇళ్లు ఉన్నాయి. ఇక ఒకేడోర్‌ నం బరులో పెద్దసంఖ్యలో ఓట్లు ఉన్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ఒకే డోర్‌ నంబరులో పది మంది కంటే ఎక్కువగా ఉన్న ఇళ్లు జిల్లా వ్యాప్తంగా దాదా పు 2,300గా గుర్తించారు. ఆయా ఇళ్లల్లో ఓటర్లు గా నమోదై ఉన్నవారు 8,000 మంది కాగా ఇప్ప టికే 6,000 మందికి ఫాం--8ను అందజేశారని ఎన్నికల అధికారులు తెలిపారు.

పొన్నూరు నియోజకవర్గంలో సున్నా డోర్‌ నెంబరుతో 234 ఓట్లు నమోదైనట్లు ప్రతిపక్ష నాయకుల పరిశీలనలో తేలింది. మండల పరిధిలోని మామిళ్లపల్లిలో సున్నా ఇంటి నెంబరుతో చంద్రికారాణి అనే ఓటుతోపాటు అదే బూత్‌లో పలు సున్నా నెంబర్లతో లోకేశ్‌ పగడాల అనే పేరు తో ఓటు నమోదై ఉంది.

అధికారుల స్పందన అంతంతే

లేకుండా ఓట్లు నమోదు అనేదే విచిత్రమైతే. ఒకే డోర్‌ నెంబర్‌లో పదుల సంఖ్యలో ఓట్లు నమోదు చేయడం ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధం. పలు నియోజకవర్గాల్లో వందల్లో ఓట్లు ఉన్నట్లు వెలుగుచూస్తున్నాయి. గతంలోనే ఆయా ఓట్లపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఏ డోర్‌ నెంబర్‌లో ఎన్ని ఓట్లు నమోద య్యాయన్న వి వరాలను సంబంధిత అధికారులకు రాజకీయ పార్టీల నాయకులు లిఖితపూర్వ కంగా అంద జేశాయి. అయితే అధికంగా ఉన్న ఓట్ల విషయంలో అధికారులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. అధికార పార్టీకి అనుకూలంగా యంత్రాంగం వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. డబుల్‌ ఎంట్రీ, మృతుల ఓట్లను తొలగించాలని కోరుతున్నా పట్టిం చుకునే వారే లేరు. మృతుల ఓట్ల తొలగింపులో కూడా బీ ఎల్‌వోలు నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తు న్నారన్న వాదన ఉన్నది.

Updated Date - 2023-07-26T13:04:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising