ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి నిర్వీర్యానికి పాలకుల కుట్ర

ABN, First Publish Date - 2023-01-03T00:26:34+05:30

రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి పాలకులు మూడు రాజధానులనే కుట్రకు పాలపడ్డారని అమరావతికి 33వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు మండిపడ్డారు.

బిల్డ్‌ అమరావతి అంటూ వెలగపూడి రైతు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

1112వ రోజుకు రైతుల ఆందోళనలు

తుళ్లూరు, జనవరి 2: రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి పాలకులు మూడు రాజధానులనే కుట్రకు పాలపడ్డారని అమరావతికి 33వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు మండిపడ్డారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు సోమవారం 1112వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని బ్రహ్మాండంగా కడతామని చెప్పిన సీఎం జగన్‌రెడ్డి మాటలన్నీ అబద్దమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయటానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ సర్వతోముఖాభివృద్ధి జరిగేదన్నారు. మూడు ముక్కల ఆటతో అది వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు మనసు మార్చుకొని అమరావతి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని 29 గ్రామాలతో పాటు తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో ఆందోళనలు కొనసాగాయి. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.

================

Updated Date - 2023-01-03T00:26:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising