ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధురాలికి పెన్షన్‌ రాకుండా చేశారు..

ABN, First Publish Date - 2023-01-03T00:31:11+05:30

రొంపిచర్ల మండలం పరగటిచర్లలో 62 సంవత్సరాల మహిళకు వైసీపీ నాయకులు పెన్షన్‌ రాకుండా చేశారని టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు.

మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, వివిధ సమస్యల బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసరావుపేట టౌన్‌, జనవరి 2: రొంపిచర్ల మండలం పరగటిచర్లలో 62 సంవత్సరాల మహిళకు వైసీపీ నాయకులు పెన్షన్‌ రాకుండా చేశారని టీడీపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు అన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్‌ వెంటనే స్పందించి ఆమెకు పెన్షన్‌ మంజూరు చేశారన్నారు. రావిపాడులో 40 సెంట్ల అసైన్డ్‌ భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించి ఇల్లు నిర్మించుకుంటున్నారని చెప్పారు. వారు చూపిన స్థల పట్టాలన్నీ ఫేక్‌ అని, కలెక్టర్‌ దృష్టికి తెచ్చామన్నారు. రావిపాడులోని ఇందిరాప్రియదర్శిని కాలనీలో మురుగుకాల్వ సదుపాయం లేదని, విద్యుత్‌ కనెక్షన్‌ లేదని, దోమలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పట్టణంలో ఇబ్రహీంను హత్యచేసినప్పుడు వారి కుటుంబానికి అధికారులు ఇచ్చిన హామీ మేరకు రూ.25లక్షలు అందజేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీపీ కడియం కోటిసుబ్బారావు, బాధితులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-03T00:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising