ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కదంతొక్కిన ఆశా వర్కర్లు

ABN, First Publish Date - 2023-07-19T03:41:00+05:30

పని భారం తగ్గించాలని, రాజకీయ వేధింపులు, అధికారుల బెదిరింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు.

పనిభారం తగ్గించాలని డిమాండ్‌

రాజకీయ, అధికార వేధింపులపై ఆగ్రహం

సంక్షేమ పథకాల అమలుకు విజ్ఞప్తి

అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): పని భారం తగ్గించాలని, రాజకీయ వేధింపులు, అధికారుల బెదిరింపులు ఆపాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు కదం తొక్కారు. 26 జిల్లాల్లో డీఎంహెచ్‌వో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు పలు డిమాండ్లు చేశా రు. తమకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారని, దీనిని వెంటనే ఆపాలని కోరారు. విధులకు అవసరమైన నాణ్యమైన సెల్‌ఫోన్లు ఇవ్వాలని కోరారు. ఆన్‌లైన్‌ వర్క్‌లు చేయడానికి శిక్షణ ఇవ్వాలని.. ప్రభుత్వ సెలవులు, మెడికల్‌ లీవులు, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవు లు ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. ఆశా వర్కర్లకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యంతో పాటు రూ.10 వేల వేతనం ఒకేసారి ఇవ్వాలని కోరారు. జిల్లాల్లో ధర్నాలు చేయడానికి ఆశాలు పెద్ద ఎత్తున సిద్ధమైన నేపథ్యంలో, పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఆశాల సమస్యలు పరిష్కరించకుండా ధర్నాలు చేయకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నిందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మీ ఆరోపించారు.

Updated Date - 2023-07-19T03:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising