ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి

ABN, First Publish Date - 2023-02-08T00:16:10+05:30

ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధాని అమరావతికి 33వేల ఎకరాలిచ్చామని, అందుకు ప్రతిఫలంగా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత తమను రోడ్డుపాలు చేసిందని రాజధాని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తుళ్లూరు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, ఫిబ్రవరి 7: ఒక్క రూపాయి తీసుకోకుండా రాజధాని అమరావతికి 33వేల ఎకరాలిచ్చామని, అందుకు ప్రతిఫలంగా ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత తమను రోడ్డుపాలు చేసిందని రాజధాని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలంటూ రైతులు, మహిళలు, రైతుకూలీలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు మంగళవారం 1148వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధితోనే రాష్ట్రప్రగతి ముడిపడి ఉందన్నారు. కానీ దానిని నాశనం చేయడమే అజెండాగా పాలకులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ముక్కల ఆటను ఐదుకోట్ల మంది తిరస్కరించారన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి జ్ఞానం రాలేదన్నారు. మూర్ఖంగా మూడు రాజధానులని ముందుకుపోతే రాష్ట్రం అధోగతి పాలు కాక తప్పదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌రెడ్డి హైకోర్టు తీర్పును గౌరవించి అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు. రాజధాని 29 గ్రామాలతో పాటు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని రైతులు బిల్డ్‌ అమరావతి అంటూ ఆందోళనలు చేశారు.

Updated Date - 2023-02-08T00:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising