అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టండి

ABN, First Publish Date - 2023-01-02T01:19:34+05:30

నూతన సంవత్సరంలోనైనా సీఎం జగన్‌రెడ్డి మనసు మార్చుకొని అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాజధానికి 33వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టండి
రోడ్లు ఊడ్చి నిరసన తెలుపుతున్న రాజఽధాని గ్రామాల మహిళలు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, జనవరి 1: నూతన సంవత్సరంలోనైనా సీఎం జగన్‌రెడ్డి మనసు మార్చుకొని అమరావతి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాజధానికి 33వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 1111వ రోజుకు చేరాయి. మందడం శిబిరంలో ముగ్గులు వేసి జై అమరావతి అంటూ నిరసన వ్యక్తం చేశారు. న్యాయదేవత విగ్రహానికి జేఏసీ నేతలు ఽధనేకుల రామారావు, అనుమోలు బాలమురళీకృష్ణ, దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌, ఆలూరి శ్రీనివాసరావు, కట్టా రాజేంద్ర పూలదండలు వేసి ఽనివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధాని ఎక్కడికీ తరలదన్నారు. గత ఏడాది మార్చి 3న హైకోర్టు ఇచ్చిన తీర్పే అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పకనే చెప్పిందన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రభుత్వం మూడు రాజధానులని గందరగోళం సృష్టించిందన్నారు. తోపుడు బండ్లపై అల్పాహారం అమ్మి నిరసనలు వ్యక్తం చేశారు. తట్టమట్టి కూడా వేయకుండా మూడేళ్ల నుండి అమరావతి అభివృద్ధిని ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారన్నారు. తుళ్లూరు, నెక్కల్లు, వెంకటపాలెం తదితర రైతు ధర్నా శిబిరాలలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ హైకోర్టు తీర్పు, ప్రజల ఆకాంక్ష ఈ నూతన సంవత్సరంలోనే నెరవేరుతుందన్నారు. మందడంలో ధర్నా శిబిరం నుండి సెంటర్‌ వరకు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులను తొలగిస్తారనే ప్రచారం జరగుతుందని, అలా జరిగితే పెద్దఎత్తున పారిశుధ్య కార్మికుల తరుపున పోరాటం చేస్తామన్నారు. రాజధాని గ్రామాలంటే వివక్షతో పాలకులున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని గ్రామాలతో పాటు తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో ఆందోళనలు కొనసాగాయి.

Updated Date - 2023-01-02T01:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising