కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: కేసీఆర్ హెల్త్‌పై చంద్రబాబు, పవన్, లోకేశ్ ట్వీట్లు

ABN, First Publish Date - 2023-12-08T14:58:57+05:30

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని

KCR: కేసీఆర్ హెల్త్‌పై చంద్రబాబు, పవన్, లోకేశ్ ట్వీట్లు

అమరావతి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. తగిలిన గాయం త్వరగా మానాలని కోరారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా స్పందించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.

పవన్ ప్రకటన విడుదల..

‘‘కేసీఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డాను. సంపూర్ణంగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయనకు అనారోగ్య పరిస్థితులు మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి స్వస్థత పొంది మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలను కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని కోరారు.

Updated Date - 2023-12-08T15:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising