ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోయిన సీఐడీ చీఫ్‌: వర్ల

ABN, First Publish Date - 2023-10-01T03:29:35+05:30

వైసీపీ ప్రభుత్వ పెద్దల బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోయిన సీఐడీ చీఫ్‌ సంజయ్‌, వారు ఆడమన్నట్లుగా ఆడుతున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సంచలన ఆరోపణ చేశారు.

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ పెద్దల బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోయిన సీఐడీ చీఫ్‌ సంజయ్‌, వారు ఆడమన్నట్లుగా ఆడుతున్నారని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సంచలన ఆరోపణ చేశారు. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల్లో సంజయ్‌కు సంబంధించిన సమాచారం వెలుగు చూసిందని, దానిని అడ్డుపెట్టుకొని వారు అతనిని లొంగదీసుకొన్నారని ఆరోపించారు. ఈ ఒత్తిడి వల్లే సంజయ్‌ దేశం అంతా తిరిగి ప్రతిపక్ష నాయకుడిపై విలేకరుల సమావేశాలు పెడుతున్నారని, తాను చేస్తోం ది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కాదనలేని నిస్సహాయ పరిస్థితిలో చిక్కుకున్నాడని చెప్పారు. శనివారం ఆయన తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎస్సైలు, సీఐల ప్రమోషన్ల విషయంలో డీజీపీ కార్యాలయంలో అవినీతి చోటు చేసుకొంటోందని, లక్షల్లో నగదు చేతులు మారుతోందని ఆరోపణలు వచ్చాయి. ఆగస్టు నెలాఖరులో డీజీపీ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిగాయి. ఇందులో సంజయ్‌ పాత్ర ప్రధానంగా వినిపించింది. ఈ సమాచారం చేతిలో పెట్టుకొని దళిత అధికారి సంజయ్‌ను భయపెట్టారు. బ్లాక్‌ మెయిలింగ్‌లో ముఖ్యమంత్రి లేదా ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి పాత్ర ఉంది’’ అని రామయ్య వివరణాత్మక ఆరోపణ చేశారు. తమకు తెలిసిన సమాచారం ప్రకారం పోలీస్‌ ప్రమోషన్లలో సంజయ్‌తోపాటు మరో అధికారి కూడా తప్పుచేశారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరిపై చర్యలు తప్పవని వర్ల హెచ్చరించారు.

Updated Date - 2023-10-01T03:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising