ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముందు కాఫర్‌ డ్యాం.. ఆ తర్వాతే వాల్‌!

ABN, First Publish Date - 2023-08-01T03:13:07+05:30

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీని అడ్డుకోకుండా.. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు ఎలా చేపడతారని కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రాష్ట్రానికి డీడీఆర్‌పీ స్పష్టీకరణ.. ఎగువ కాఫర్‌ డ్యాంలో నీరు ఎగదన్నుతోంది

రెండు డ్యాంల నడుమ భారీగా చేరుతోంది

మోటార్లతో తోడడం కాదు.. సీపేజీని ఆపడమెలాగో తేల్చాలి

అది చేయకుండా డయాఫ్రం వాల్‌ మరమ్మతులు ఎలా సాధ్యం?

రాష్ట్రాన్ని నిలదీసిన డీడీఆర్‌పీ

అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని నిర్దేశం

అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీని అడ్డుకోకుండా.. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు ఎలా చేపడతారని కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీపేజీతో పాటు భారీగా వరద ప్రవాహం వస్తోందని.. దానిని నివారించే చర్యలపై అధ్యయనం చేయాలని పేర్కొంది. ఎగదన్నుతున్న నీరు ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్యలో చేరుతోందని.. దానిని మోటార్లతో తోడడం కంటే .. నివారణ చర్యలపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది. సోమవారం ఢిల్లీలో ఏబీ పాండ్యా నేతృత్వంలో డీడీఆర్‌పీ సమావేశం జరిగింది. ప్యానెల్‌ సభ్యులు, కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలసంఘం అధికారులు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు హాజరయ్యారు. నిజానికి ఇక్కడ డయాఫ్రం వాల్‌ మరమ్మతులు, కొత్తది నిర్మించడంపై సమీక్ష జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు భావించారు. అయితే డీడీఆర్‌పీ దానిని పక్కనపెట్టి.. ఎగువ కాఫర్‌ డ్యాం సీపేజీపైనే దృష్టి కేంద్రీకరించింది. ఎగువ కాఫర్‌ డ్యాం 2018లోనే పూర్తయిందని.. అదే ఏడాది డయాఫ్రం వాల్‌ కూడా పూర్తయిందని.. పనులు ఆపకుండా దానిపై వెంటనే ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంను నిర్మించి ఉంటే.. ప్రస్తుత సమస్యలు తలెత్తేవే కావని ప్యానెల్‌ అభిప్రాయపడింది. దాదాపు ఐదేళ్ల కాలం పూర్తయినందున ఎగువ కాఫర్‌ డ్యాం పటుత్వం దెబ్బతిందని తెలిపింది. ఈ నేపథ్యంలో దాని నుంచి భారీగా ఎగదన్నుకొస్తున్న సీపేజీని నివారించే మార్గాలపై శాస్త్రీయ అధ్యయనం చేసి.. తమకు నివేదిక సమర్పించాలని జల వనరుల శాఖను ఆదేశించింది. కాఫర్‌ డ్యాం మరమ్మతు పూర్తయ్యాకే.. డయాఫ్రం వాల్‌ అంశంపై పరిశీలన చేద్దామని స్పష్టం చేసింది. ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలో చెప్పలేదు.

నేపథ్యమిదీ..

జూలై 10న కేంద్ర జలపోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీని అడ్డుకోకుండా.. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు ఎలా చేపడతారని కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ) రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది.శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేవర్షి ముఖర్జి అధ్యక్షతన సమీక్ష జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని సంస్థలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్‌తోపాటు ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీనా చర్చ జరిగింది. సీపేజీ సమస్య ఉన్నప్పటికీ అది ప్రమాదకర స్థాయిలో లేదని కేంద్ర జల సంఘం, పీపీఏ, ఇతర సంస్థలు అభిప్రాయపడ్డాయి. అయితే ఊరకే అభిప్రాయాలు చెప్పడం కాదని.. లిఖితపూర్వకంగా నివేదికలివ్వాలని దేవర్షి స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే.. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతు చేయాలో.. కొత్తది నిర్మించాలో అధ్యయనం చేసి వారం రోజుల్లోగా లిఖితపూర్వక నివేదిక సమర్పించాలని రాష్ట్ర జల వనరుల శాఖను ఆమె ఆదేశించారు. దీనిపై జలవనరుల శాఖ, జర్మన్‌ సంస్థ బావర్‌ కసరత్తు చేశాయి. సదరు వాల్‌కు మరమ్మతు చేయడంకంటే.. కొత్తది నిర్మించడమే మేలంటూ జల వనరుల శాఖ ఈ నెల 19వ తేదీన పీపీఏ ద్వారా నివేదిక సమర్పించింది. బావర్‌ సంస్థ ఇచ్చిన సలహాలు, సూచనలను కూడా జతచేసింది. దీనిని పరిశీలించిన పీపీఏ.. మరికొన్ని వివరాలు కోరింది. వాటికి జవాబులను సోమవారంనాటి డీడీఆర్‌పీ సమావేశానికి తీసుకురావాలని సూచించింది. ఈ వివరాలతో రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. కాగా.. పోలవరం ప్రాజెక్టు కట్టడాలు వరుసగా దెబ్బతింటుండడంపై కేంద్ర జలశక్తి శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం.. ఆ తర్వాత గైడ్‌బండ్‌ కుంగిపోవడం.. వాటికి ఎలాంటి మరమ్మతులు చేయాలో ఆలోచిస్తున్న తరుణంలోనే.. ఎగువ కాఫర్‌ డ్యాం పునాదుల నుంచి నీరు ఎగజిమ్మడం దానికి ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2023-08-01T03:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising