సిటిజన్ సర్వేలో జీఎంసీకి ఏపీలో మొదటి స్థానం
ABN, First Publish Date - 2023-01-09T00:46:23+05:30
కేంద్ర ప్రభు త్వ సిటిజన్ పర్‌సెప్షన్ సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 6వ స్థానంలో నిలవడం గుంటూరు నగరా నికి గర్వకారణమని, ఇందులో భాగస్వాములైన నగర ప్రజలు, సచివాలయ కార్యదర్శులకు, సిబ్బందికి ప్రత్యేక అభి నందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు( కార్పొరేషన్), జనవరి 8 : కేంద్ర ప్రభు త్వ సిటిజన్ పర్‌సెప్షన్ సర్వేలో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 6వ స్థానంలో నిలవడం గుంటూరు నగరా నికి గర్వకారణమని, ఇందులో భాగస్వాములైన నగర ప్రజలు, సచివాలయ కార్యదర్శులకు, సిబ్బందికి ప్రత్యేక అభి నందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర అభివృద్ధి, మౌలిక వసతులు, ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వం సిటిజన్ పర్‌సెప్షన్ సర్వే చేపడుతుందన్నారు. సర్వేలో దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడి గుంటూరు నగరం జాతీయస్థాయిలో 6, రాష్ట్రస్థాయిలో తొలిస్థా నంలో నిలిచిందని అన్నారు. సర్వేలో నగరానికి మంచి ర్యాంకు రావడం ద్వారా నగరంలో పలు అభివృద్ధి పను లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు మం జూరయ్యే అవకాశం ఉందన్నారు. నగర ప్రజలకు సర్వే పై అవగాహన కల్గించి దేశస్థాయిలో ప్రతిష్టాత్మక సర్వే లో గుంటూరు నగరం అత్యుత్తమ స్థానంలో నిలిచేలా నోడల్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు, వలంటీ ర్లు టీంవర్క్‌తో కృషి చేశారని, సర్వే ద్వారా నగర అభి వృద్ధి, మౌలిక వసతులపై ప్రజల అభిప్రాయాలు కూ డా తెలుసుకోవడానికి నేరుగా అవకాశం కల్గిందన్నారు.
Updated Date - 2023-01-09T00:46:27+05:30 IST