ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరంకుశపాలన అంతమయ్యే సమయం ఆసన్నమైంది

ABN, First Publish Date - 2023-02-23T00:11:44+05:30

రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని టీడీపీ నాయకులు డాక్టర్‌ కోడెల శివరామ్‌ అన్నారు.

డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శివరామ్‌, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డాక్టర్‌ కోడెల శివరామ్‌

సత్తెనపల్లి రూరల్‌, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమయ్యే సమయం ఆసన్నమైందని టీడీపీ నాయకులు డాక్టర్‌ కోడెల శివరామ్‌ అన్నారు. మండలంలోని రెంటపాళ్ళలో బుధవారం రాత్రి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శివరామ్‌ మాట్లాడుతూ తన పాలనకు అంతిమ గడియలు దగ్గర పడ్డాయన్న విషయాన్ని జగన్‌రెడ్డి గమనించే ప్రతిపక్ష నేతలపై దాడులు చేయించటం, అక్రమ కేసులు బనాయించటం, ర్యాలీలు, సభలను అడ్డుకోవటం చేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఫ్యాక్షన్‌ పాలన జరుగుతుందన్నారు. ప్రజలంతా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారని, ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డికి బుద్ధి చెపుతారన్నారు. డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారన్నారు. ముందుగా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అనంతరం డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని శివరామ్‌ ఆవిష్కరించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల, గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

టీడీపీ నేతలతో చర్చలు

పట్టణంలోని పలువురు టీడీపీ నేతల గృహాలకు డాక్టర్‌ కోడెల శివరామ్‌ బుధవారం వెళ్ళి వివిధ అంశాల గురించి మాట్లాడారు. మాజీ కౌన్సిలర్‌ చుక్కపల్లి కేశవరావు, అనుమోలు జయరామ్‌, ధనేకుల రామారావు, గుంటుపల్లి నాగేశ్వరరావు, ఎం కామేశ్వరరావు, యూ ప్రభాకర్‌, ఎం మౌలాలి, పీ గురు చరణ్‌ ప్రసాదు, ఎల్‌ పిచ్చయ్య గృహాలకు డాక్టర్‌ కోడెల శివరామ్‌ వెళ్ళి వివిధ అంశాల గురించి మాట్లాడారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు సయ్యద్‌ పెద కరిముల్లా, కె.శ్రీనివాసరావు, ఎన్‌.పాపారావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-02-23T00:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising