ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lulu: ఇక్కడ తరిమేశారు.. అక్కడ కట్టుకున్నారు!

ABN, First Publish Date - 2023-06-18T03:09:41+05:30

కొత్తగా పెట్టుబడులు సాధించలేరు! అప్పటికే వచ్చిన ప్రాజెక్టులను కాపాడుకోలేరు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖకు రావాల్సిన లులూ కోయంబత్తూరుకు

టీడీపీ హయాంలో సంస్థతో ఒప్పందం

బీచ్‌ రోడ్డులో భారీ ప్రాజెక్టుకు ప్రతిపాదన

2,200 కోట్ల పెట్టుబడి, 5 వేల మందికి ఉపాధి

13.59 ఎకరాల స్థలం కూడా అప్పగింత

అధికారంలోకి రాగానే చెడగొట్టిన వైసీపీ

పేచీలు తట్టుకోలేక వెళ్లిపోయిన లులూ

అదే సమయంలో తమిళనాడు నుంచి ఆహ్వానం

15 నెలల్లోనే భారీ మాల్‌ నిర్మించి ప్రారంభం

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): కొత్తగా పెట్టుబడులు సాధించలేరు! అప్పటికే వచ్చిన ప్రాజెక్టులను కాపాడుకోలేరు! ఇదీ... వైసీపీ సర్కారు తీరు! దీని ఫలితం... విశాఖ నగరం అనుభవిస్తోంది! జగన్‌ సర్కారు ఇక్కడి నుంచి తరిమేయడంతో ‘లులూ’ సంస్థ... తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లిపోయింది. అక్కడ నెలల వ్యవధిలోనే బ్రహ్మాండమైన మాల్‌ నిర్మించింది.

నాడు టీడీపీ సర్కారు ఆరాటం...

దుబాయ్‌కి చెందిన ‘లులూ’ గ్రూప్‌నకు హైపర్‌ మార్కెట్లను (మాల్స్‌) నిర్మించడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. కేరళకు చెందిన యూసఫ్‌ అలీ 22 ఏళ్ల కిందట దీనిని స్థాపించారు. ఇలాంటి సంస్థను విశాఖకు రప్పించాలని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. ఆ సంస్థ సింగపూర్‌లో ఏర్పాటు చేసిన తరహాలో... విశాఖలోనూ షాపింగ్‌మాల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేలా ఒప్పించింది. 2018లో విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో దీనిపై ఎంవోయూ కూడా కుదిరింది. అదే వేదికపై నాటి సీఎం చంద్రబాబు, నాటి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో శంకుస్థాపన కూడా చేశారు. బీచ్‌ రోడ్డులో హార్బర్‌ పార్కు ఎదురుగా ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాలను లులూకు కేటాయించారు. రూ.2,200 కోట్ల పెట్టుబడి పెట్టి ఐదువేల మందికి ఉపాధి కల్పిస్తామని లులూ ప్రకటించింది. 30 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒప్పందం.

వైసీపీ రాగానే రివర్స్‌..

అధికారంలోకి వచ్చీ రాగానే పాత ప్రాజెక్టులు, ఒప్పందాలను తిరగదోడటం మొదలుపెట్టిన జగన్‌ సర్కారు... లులూనూ ‘రివర్స్‌’ బాట పట్టించింది. ‘మీరు ఆఫర్‌ చేసిన అద్దె సరిపోదు. ఇంకా పెంచాలి’ అని పేచీ పెట్టింది. గత ప్రభుత్వం పిలిచి పెద్దపీట వేయగా... కొత్త ప్రభుత్వం కయ్యాలు పెట్టుకోవడంతో లులూ గ్రూప్‌ విసిగిపోయింది. ‘మీకు దండం. ఇక్కడ ఉండం’ అని చెప్పి ఏపీ నుంచి వెళ్లిపోయింది. లులూకు కేటాయించిన 13.59 ఎకరాల స్థలాన్ని మరో సంస్థకు కేటాయించి ఉపాధి అవకాశాలు పెంచాలన్న ఆలోచన కూడా జగన్‌ సర్కారు చేయలేదు. పైగా దాంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించింది. ఆసక్తి కలిగిన సంస్థ వచ్చి, అక్కడ నిర్మాణాలు చేపట్టి, ప్రభుత్వానికి చదరపు అడుగుకు రూ.6,500 చొప్పున ఇవ్వాలని కోరింది. అందుకు ఒక్కరు కూడా ముందుకురాలేదు. ఈలోగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో రెండేళ్ల క్రితం ఆ భూమిని తాకట్టు పెట్టి అప్పు తేవాలని ప్రయత్నించింది. దీనిపై ప్రజా సంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ కూడా ఆగిపోయింది. దాంతో నాలుగేళ్లుగా ఆ భూమి వృథాగా ఉంది.

తమిళనాడు ఇలా...

ఏపీ సర్కారు తరిమేసిన ‘లులూ’కు పొరుగునే ఉన్న తమిళనాడు ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌ పరిచింది. కోయంబత్తూరులో వారు కోరిన స్థలం అందించింది. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 3వేల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకుంది. లులూ గ్రూపు కేవ లం 15 నెలల్లో కోయంబత్తూరులో భారీ హైపర్‌ మా ర్కెట్‌ను నిర్మించింది. దీనిని ఈనెల 14న ప్రారంభించా రు కూడా! పరిసర ప్రాంతాల రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకుంది. యువతకు ఉపాధి కల్పించింది. అదే సంస్థతో జగన్‌ సర్కారు ఒప్పందం రద్దు చేసుకోకుంటే.. విశాఖలో లులూ ప్రాజెక్టు నిర్మాణాలు ఈ పాటికే పూర్తయ్యేవి. కోయంబత్తూరులో కట్టింది హైపర్‌ మార్కెట్‌ ఒక్కటే. కానీ, టీడీపీ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం షాపింగ్‌ మాల్‌తోపాటు కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కూడా వచ్చేవి.

Updated Date - 2023-06-18T05:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising